మేనల్లుడి పెళ్లికి ప్లెక్సీలు తీసుకువెళుతుండగా..

ABN , First Publish Date - 2021-11-26T06:30:58+05:30 IST

మేనల్లుడి పెళ్లికి ప్లెక్సీలు తీసుకువెళుతుం డగా ప్రమాదవశాత్తు బైక్‌ అదుపు తప్పి కిందపడిన ఓ యువకుడు మృతి చెందాడు.

మేనల్లుడి పెళ్లికి ప్లెక్సీలు తీసుకువెళుతుండగా..

వలిగొండ, నవంబరు 25: మేనల్లుడి పెళ్లికి ప్లెక్సీలు తీసుకువెళుతుం డగా ప్రమాదవశాత్తు బైక్‌  అదుపు తప్పి కిందపడిన ఓ యువకుడు   మృతి చెందాడు. ఎస్‌ఐ రాఘవేంద్రగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వలి గొండకు చెందిన గొలుసుల మల్లయ్య చిన్నకుమారుడు దుర్గాప్రసాద్‌ (23) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అవివాహితుడు. తన సోదరి కుమారుడి వివాహానికి ప్లెక్సీలు తీసుకుని బైక్‌పై బుధవారం రాత్రి  మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెంకు వెళుతుండగా వలిగొండ మండలం  వెల్వర్తి గ్రామ శివారులో బైక్‌ అదుపు తప్పి కింద పడ్డాడు.  ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైన అతడిని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు భువనగిరి ఏరియా ఆసుపత్రికి  తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలిం చగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. దురా ్గప్రసాద్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-11-26T06:30:58+05:30 IST