మీరేం చేస్తున్నారు?

ABN , First Publish Date - 2021-08-27T06:07:41+05:30 IST

రోడ్డు వేసిన నెల రోజుల్లో శిథిలావస్థకు చేరిన రహదారిని చూసి మంత్రి జగదీ్‌షరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీరేం చేస్తున్నారు?
దూపహాడ్‌ గ్రామంలో శిథిలావస్థకు చేరిన తారురోడ్డును పరిశీలిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి

నెల రోజుల్లోనే రోడ్డు శిథిలావస్థకు చేరడమా ?

మీ పనులతో మేం బద్నాం 

ఆర్‌అండ్‌బీ అధికారులపై మంత్రి జగదీ్‌షరెడ్డి ఆగ్రహం  

పక్షం రోజుల్లో కొత్త రోడ్డు నిర్మించాలని ఆదేశం

పెన్‌పహాడ్‌, ఆగస్టు 26: రోడ్డు వేసిన నెల రోజుల్లో శిథిలావస్థకు చేరిన రహదారిని చూసి మంత్రి జగదీ్‌షరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరేం చేస్తున్నారంటూ ఆర్‌అండ్‌బీ అధికారులను ఆయన  నిలదీశారు. గరిడేపల్లి మండ లం గడ్డిపల్లిలో ఓ శుభకార్యానికి నకిరేకల్‌ ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్యతో వెళుతూ దూపహాడ్‌ గ్రామసమీపంలోని నెల రోజుల కిందట వేసిన రహదారి ధ్వంసమై ఉండటాన్ని గమనించారు. వెంటనే తన సిబ్బందితో ఆర్‌అండ్‌బీ అధికారులను పిలిపించాలని ఆదేశించారు. అంతలో మంత్రి శుభకార్యానికి హాజరై తిరిగి వచ్చారు. నాణ్యతా లోపం తో వేసిన రోడ్డు ధ్వంసం కావటాన్ని అధికారులకు చూపించి ప్రశ్నలవర్షం కురిపించారు. నాణ్యత లేకుండా కాంట్రాక్టర్‌ ఇష్టానుసారంగా రోడ్డు నిర్మిస్తుంటే పర్యవేక్షణ చేయాల్సిన మీరు ఏం చేశారం టూ అధికారులపై మండిపడ్డారు. అధికారులుగా మీరు చేసే తప్పుల వల్ల మేం బద్నాం కావాల్సి వస్తుందన్నారు. 15 రోజుల్లో నాణ్యతతో రహదారి నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా దూపహాడ్‌ గ్రామంలో రాజీవ్‌గాంధీ విగ్రహం నుం చి మిషన్‌ భగీరథ ట్యాంకు వరకు సీసీ రోడ్డును నిర్మించాలని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులను ఆదేశించారు. పదిహేను రోజుల్లో రోడ్డును నిర్మిస్తామని అధికారులు మంత్రికి వివరించారు. మంత్రి వెంట దూపహాడ్‌ సర్పంచ్‌ బిట్టు నాగేశ్వర్‌రావు, పెద్దగట్టు డైరెక్టర్‌ అంజయ్య యాదవ్‌, మహిళా సంఘం మండల అధ్యక్షురాలు స్వర్ణ పాల్గొన్నారు.

 స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయం

సూర్యాపేటటౌన్‌: నాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయమని మంత్రి గుం టకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీపార్కులో స్వాతంత్ర సంగ్రామం ప్రారంభమై 75 ఏళ్లు నిండిన సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లోని నాయకులు, ప్రజ లు స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములై తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించారన్నారు. స్వాతంత్ర సమరయోధులను గుర్తు తెచ్చుకునేలా ఇలాంటి ఎగ్జిబిషన్లు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జడ్పీవైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, జడ్పీటీసీ జీడి భిక్షం, సంఘం సభ్యులు కోటేశ్వర్‌రావు, అబీబ్‌, గండూరి శంకర్‌, వాసా శ్రీశైలం పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-27T06:07:41+05:30 IST