చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-12-26T06:16:19+05:30 IST

నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ లో చేపల వేటకు వెళ్లి విషపురుగు కుట్టడంతో యువకుడు మృ తి చెందాడు.

చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి
స్వామి మృతదేహం

పెద్దవూర, డిసెంబరు 25: నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ లో చేపల వేటకు వెళ్లి విషపురుగు కుట్టడంతో యువకుడు మృ తి చెందాడు. ఈ ఘటన పెద్దవూర మండల పరిధిలోని పాల్తి తండాలో శనివారం జరిగింది. పోలీసులు కథనం ప్రకారం... పా ల్తి తండాకు చెందిన పాల్తి స్వామి (27) గ్రామ సమీపంలో ఉ న్న సాగర్‌ రిజర్వాయర్‌లో పుట్టిపై వలతో మధ్యాహ్న సమయం లో చేపల వేటకు వెళ్లాడు. చేపలను పట్టుకొని తిరిగి వచ్చే క్ర మంలో వలలో ఉన్న గుర్తు తెలియని విష పురుగు ఎడమకాలి మడిమ వద్ద కుట్టింది. తీవ్ర బాధతో పాటు రక్తం కారుతుండ టంతో పాటు తోటి జాలర్లు నాగార్జునసాగర్‌ కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడు స్వామికి భార్య పుష్ప, ఇద్దరు కూతుళ్లు, ఆరు నెలల బాబు ఉన్నారు. భార్య ఫిర్యాద ుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పరమేష్‌ తెలిపారు.


Updated Date - 2021-12-26T06:16:19+05:30 IST