సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: జడ్పీ చైర్‌పర్సన్
ABN , First Publish Date - 2021-02-27T04:51:30+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని జడ్పీ చైర్‌పర్సన్ గుజ్జ దీపికాయుగేందర్‌రావు అన్నారు.

సూర్యాపేటటౌన్, ఫిబ్రవరి 26 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని జడ్పీ చైర్‌పర్సన్ గుజ్జ దీపికాయుగేందర్‌రావు అన్నారు. జడ్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పలు స్థాయీ సంఘాల సమావేశాల్లో ఆమె మాట్లాడారు. అధికారులు ప్రోటోకాల్ పాటించి ప్రజా ప్రతినిధులను అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానించాలన్నారు. ఈ సందర్భంగా హుజూర్‌నగర్ జడ్పీటీసీ మాట్లాడుతూ ట్రాక్టర్ ట్రాలీ కొనుగోలు విషయంలో గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో విజయలక్ష్మి, డిప్యూటీ సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి, జడ్పీటీసీలు, కో-ఆప్షన్‌మెంబర్లు పాల్గొన్నారు.