సంక్షేమ పథకాలు టీఆర్‌ఎ్‌సతోనే సాధ్యం : జీవన్‌రెడ్డి
ABN , First Publish Date - 2021-03-21T06:34:08+05:30 IST
సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే అది టీఆర్‌ఎ్‌సతోనే సాధ్యమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు.

మాడ్గులపల్లి, మార్చి 20 : సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే అది టీఆర్‌ఎ్‌సతోనే సాధ్యమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలోని గజలాపురం గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయ ంగా పని చేస్తున్నారన్నారు. రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్ వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ అన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే పరిస్థితికి దిగజారారన్నారు. అనంతరం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ చామంతి, నాయకులు పాల్గొన్నారు.
గడపగడపకు ఎమ్మెల్యే కోనప్ప ప్రచారం
హాలియా : అనుముల మండల ఇన్‌చార్జి, సిర్పూర్, కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మండలంలోని పేరూరు గ్రామంలోని శ్రీ స్వయంభు సోమేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి ప్రచారం నిర్వహించారు. ప్రతీ ఇంటికి తిరుగుతూ ప్రజలకు సంక్షేమ పథకాలను వివరిస్తూ చైతన్య పరిచారు. వారి వెంట ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, ఎడ మ కాల్వ మాజీ వైస్ చైర్మన్ మలిగిరెడ్డి లింగారెడ్డి, రావుల చిన్నభిక్షం, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఎంపీపీ పేర్ల సుమతి పురుషోత్తం, మండల అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, ఎన్నమళ్ల సత్యం, సర్పంచ్‌లు యడవెల్లి సంధ్యారాణి నాగరాజు, కుందారపు సైదులు, రిక్కల వెంకట్‌రెడ్డి, రవి, మగ్బూల్, దుండిగల శ్రీను పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ వైపే ఓటర్లు : శంకర్‌నాయక్
త్రిపురారం : సాగర్ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మహబూబాబాద్ ఎమ్మెల్యే, మండల ఇన్‌చార్జి బానావత్ శంక ర్‌నాయక్ ధీమా వ్యక్తంచేశారు. మండలంలోని కాపువారి గూడెం, డొంకతండ, బిషతండా, కుంకుడు చెట్టు తం డా, బడాయిగడ్డకు చెందిన వివిధ పార్టీల నా యకు లు శంకర్‌నాయక్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
ప్రతీ కార్యకర్తకు అండగా టీఆర్‌ఎస్ : సునీల్‌రావు
నాగార్జునసాగర్ : రాష్ట్రంలో ప్రతీ కార్యకర్తకు టీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉ ంటుందని సాగర్ ఎన్నికల ఇన్‌చార్జి, కరీంనగర్ మేయర్ సునీల్‌రావు అన్నారు. సాగర్ పైలాన్ కాలనీలో ప్రమాదవశాత్తు ఇల్లు కాలిన బాధితుడు అబ్దుల్లా కుటుంబసభ్యులను శుక్రవారం పరామర్శించారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రామకృష్ణారావు, టీఆర్‌ఎస్ నాయకులు బ్రహ్మరెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, శ్రావణ్‌కుమార్, సురేష్, సాయికృష్ణ, మోహన్, వంశీ, రత్నం, అజయ్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
టీఆర్‌ఎ్‌సలో పలువురి చేరిక
నిడమనూరు / గుర్రంపోడు / హాలియా : నిడమనూరు మండలంలోని పార్వతీపు రం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ వంకా బ్రహ్మన్న తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే భాస్కర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. అదేవిధంగా గుర్రంపోడు మండలంలోని పాశంవారిగూడెం గ్రామ ంలో వివిధ పార్టీలకు చెందిన పలు కుటుంబాలు టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. హాలియా మునిసిపాలిటీలోని 9వ వార్డు ఇన్‌చార్జి మాతంగి కాశయ్య, లింగంపల్లి సైదులు ఆధ్వర్యంలో సుమారు 200మంది వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో చేరినట్లు రామగుండం ఎమ్మెల్యే, హాలియా మున్సిపాలిటీ ఇన్‌చార్జి కోరుకంటి చందర్ తెలిపారు. హాలియాలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.