ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం

ABN , First Publish Date - 2021-01-13T06:04:52+05:30 IST

నాగార్జునసాగర్‌ కమలా నెహ్రూ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సౌకర్యాల కల్పన, వైద్యుల పనితీరుపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపామని, ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని డీసీహెచ్‌వో మాతృనాయక్‌ తెలిపారు.

ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం

డీసీహెచ్‌వో మాతృనాయక్‌ 

నాగార్జునసాగర్‌, జనవరి12: నాగార్జునసాగర్‌ కమలా నెహ్రూ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సౌకర్యాల కల్పన, వైద్యుల పనితీరుపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపామని, ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని డీసీహెచ్‌వో మాతృనాయక్‌ తెలిపారు. ఆస్పత్రిలో సౌ కర్యాలు, వైద్యుల పనితీరుపై సాగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త్త హాజీ రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, సీఎం, సీఎస్‌ల, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులకు లేఖలు రాశారు. స్పందించిన వైద్యవిధాన పరిషత్‌ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. దీంతో డీసీహెచ్‌వో మా తృనాయక్‌ దేవరకొండ ఆస్పత్రి సీఎంవో డాక్టర్‌ రాములునాయక్‌తో కలి సి మంగళవారం ఆస్పత్రిలో విచారణ చేశారు. ఆస్పత్రిలో సరైన వైద్య పరికరాలు లేవని, డాక్టర్లు సమయపాలన పాటించడం లేదని ఫిర్యాలు అందాయని తెలిపారు. డాక్టర్‌ అమృత్‌నాయక్‌ పది సంవత్సరాలుగా ఇ క్కడే ఉన్నారని ఫిర్యాదు అందిందని తెలిపారు. ఆస్పత్రిలో అధునాతన పరికరాలు ఉన్నాయని, రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. నర్సింగ్‌ కళాశాల పునఃప్రారంభంపై ఉన్నతాధికారులకు లేఖ రాస్తామని తెలిపారు. ఇద్దరు మహిళా గైనకాలజిస్టులను నియ మించడంతో ప్రసవాల సంఖ్య పెరిగిందని తెలిపారు. 

Updated Date - 2021-01-13T06:04:52+05:30 IST