పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం

ABN , First Publish Date - 2021-11-09T06:08:50+05:30 IST

పోడు భూముల సమస్యల పరిష్కారంలో అర్హులకు అన్యాయం జరగకుండా చూస్తామని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. అడవుల సంరక్షణ, పోడు భూముల సమస్యలపై భువనగిరి శివారులోని ఓ హోటల్‌లో సోమవారం జరిగి

పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం
ప్రతిజ్ఞ చేస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు

అర్హులందరికీ న్యాయం చేస్తాం 

మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

భువనగిరి రూరల్‌, నవంబరు 8: పోడు భూముల సమస్యల పరిష్కారంలో అర్హులకు అన్యాయం జరగకుండా చూస్తామని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. అడవుల సంరక్షణ, పోడు భూముల సమస్యలపై భువనగిరి శివారులోని ఓ హోటల్‌లో సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 33 శాతం అటవీ ప్రాంతం ఉంటే మానవజాతికి మనుగడ ఉంటుందన్నారు. అటవీ భూములు కాపాడుతూ, గిరిజనులకు హక్కులు కల్పించి, వారి జీవనోపాధి దెబ్బతినకుండా చూ డాలని 2006లో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందని తెలిపారు. ఆ చట్టానికి లోబడి సాగు చేసుకున్న వారికి హక్కు కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు రూపొందించారన్నా రు. రాష్ట్రంలో ఆరు లక్షల దరఖాస్తులు వస్తే 2లక్షల 90వేల ఎకరాలకు సంబంధించి హక్కు పత్రాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో 8లక్షల 4వేల 300ఎకరాల భూమి లో 29వేల 531 ఎకరాల అటవీ భూమి ఉందన్నారు. చౌటుప్పల్‌, తుర్కపల్లి, నారాయణపూర్‌ మండలాలకు సంబంధించి ఎనిమిది గ్రామాల్లో 1,318 ఎకరాల పోడు భూమి ఉన్న ట్లు గుర్తించామని, 326మంది ఎస్సీలకు సంబంధించి 127ఎకరాలు, ఇతరులు 159మం దికి 489ఎకరాలు సంబంధించి హక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉందన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ పోడు భూముల సమస్య జటిలమైనదని, ప్రభు త్వం అఖిలపక్ష నేతల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని అర్హులైన వారికి భూమిపై హక్కు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యా దవ్‌, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్‌ పమేలా సత్పథి, అదనపు కలెక్టర్లు డి. శ్రీనివాస్‌రెడ్డి, దీపక్‌తివారీ, జడ్పీ వైస్‌చైర్మన్‌ ధనావత్‌ బీకూనాయక్‌, ఆర్డీవోలు ఎంవీ. భూపాల్‌రెడ్డి, ఎస్‌. సూరజ్‌కుమార్‌, డీఎ్‌ఫవో వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మంగ్తానాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-09T06:08:50+05:30 IST