దేవాలయం నిర్మాణానికి ఆర్థికంగా సహకారం అందిస్తాం

ABN , First Publish Date - 2021-12-09T07:09:23+05:30 IST

మండలంలోని కూచిపూడి గ్రామం లోని స్వయంభు అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న సీతారాముల దేవాలయానికి ఆర్థికంగా సహకారం అందిస్తామని ముస్లిం దంపతులు నజీర్‌, మసాబ్‌లు అన్నారు.

దేవాలయం నిర్మాణానికి ఆర్థికంగా సహకారం అందిస్తాం
దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్న ముస్లిం దంపతులు

ముస్లిం దంపతులు

కోదాడ రూరల్‌, డిసెంబరు 8: మండలంలోని కూచిపూడి గ్రామం లోని స్వయంభు అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న సీతారాముల దేవాలయానికి ఆర్థికంగా సహకారం అందిస్తామని ముస్లిం దంపతులు నజీర్‌, మసాబ్‌లు అన్నారు. కోదాడలోని కేఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశా లలో నజీర్‌ లెక్చరర్‌గా పని చేస్తుండగా, మసాబ్‌ గృహిణి. కూచిపూడి అభయాంజనేయ స్వా మి దేవాలయంలో బుధవారం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఈ దంప తులు పాల్గొన్నారు. తదనంతరం వారు మాట్లాడుతూ హిందూ దేవాలయాలను  వెళ్లడంతో పాటు  హిందూ దేవతలను ఆరాధిస్తామన్నారు. నిర్మాణంలో ఉన్న సీతారాముల దేవస్థానానికి తమవంతు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకుడు కందికొండ సాయిబాబా పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T07:09:23+05:30 IST