నిబంధనల ప్రకారం పరిహారం అందజేస్తాం

ABN , First Publish Date - 2021-11-26T06:26:32+05:30 IST

ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం అందచేస్తామని భువనగిరి ఆర్డీవో ఎంవీ భూపాల్‌రెడ్డి అన్నారు.

నిబంధనల ప్రకారం పరిహారం అందజేస్తాం
భువనగిరి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో మాట్లాడుతున్న ఆర్డీవో భూపాల్‌రెడ్డి

ఆర్డీవో ఎంవీ భూపాల్‌రెడ్డి 

భువనగిరి రూరల్‌, నవంబరు 25: ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం అందచేస్తామని భువనగిరి ఆర్డీవో ఎంవీ భూపాల్‌రెడ్డి అన్నారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో మండలంలోని బీఎన్‌ తిమ్మాపురం ముంపు నిర్వాసితులతో భూసేకరణపై గురువారం నిర్వహించిన జనరల్‌ అవార్డు సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో ఇప్పటికే 473ఎకరాల వ్యవసాయ భూమికి పరిహారం చెల్లించామని, మిగతా 1179ఎకరాల వ్యవసాయ భూమికి సంబంఽధించిన 450మంది రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరానికి రూ. 15,04,998 పరిహారం చెల్లిస్తామన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్లే వెసులుబాటు కూడా కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సమీప గ్రామాల్లో ఎకరానికి రూ.40నుంచి 50లక్షల వరకు మార్కెట్‌ ధర ఉందని, తమకు నష్టపరిహారం పెంచే విధంగా చర్య లు తీసుకోవాలని కోరారు. తాము సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్న సీలింగ్‌, కబ్జా భూములకు పరిహారం చెల్లించే విధంగా చూడాలని కోరుతూపీ ఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ ఎడ్ల సత్తిరెడ్డి, ఎంపీటీసీ ఉడుత శారద, సర్పంచ్‌ పిన్నం లత, ఉప సర్పంచ్‌ ఎడ్ల సుద ర్శన్‌రెడ్డి తదితరులు అధికారులకు సూచించా రు. పునరావాసం పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద అర్హులైన ముంపు నిర్వాసితులందరికీ న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డీఏవో మందడి ఉపేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ పి.శ్యాం సుందర్‌రెడ్డి, ఇరిగేషన్‌ ఈఈ కుర్షిద్‌, ముంపు నిర్వాసితులు ఎడ్ల సత్తిరెడ్డి, పిన్నం రాజు, వల్దాసు రాజు, నందు, ఆంజనేయులు పాల్గొన్నారు. 




Updated Date - 2021-11-26T06:26:32+05:30 IST