జిల్లా ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పిస్తాం

ABN , First Publish Date - 2021-05-18T07:06:09+05:30 IST

భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రోగులకు నాణ్య మైన వైద్య సేవలు అందేందుకు అవసరం అయిన మౌలిక వసతులను కల్పి స్తామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తెలిపారు.

జిల్లా ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పిస్తాం
భువనగిరి జిల్లా ఆసుపత్రిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

 రూ.12లక్షలు సొంత నిధులు కేటాయింపు: ఎమ్మెల్యే పైళ్ల 

 భువనగిరి టౌన్‌, మే 17: భువనగిరి జిల్లా  కేంద్ర ఆసుపత్రిలో రోగులకు నాణ్య మైన వైద్య సేవలు అందేందుకు అవసరం అయిన మౌలిక వసతులను కల్పి స్తామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన డీఎంహెచ్‌వో డాక్టర్‌ సాంబశివరావుతో కలిసి ఆసుపత్రిని పరిశీలించారు. రూ.12లక్షల సొంత నిధులతో రోగుల సహాయకులకు విశ్రాంతి గది, డ్రైనేజీ, ఆసుపత్రి ఆవరణలో సీసీ రోడ్డు, కొవిడ్‌ వ్యాక్సిన్‌, టెస్టుల కోసం వస్తున్న వారికి నీడను కల్పించేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు  చేస్తున్నట్లు తెలిపారు.  కరోనా వార్డుతో పాటు అన్ని వార్డులను పరిశీలించి రోగులు, వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. ఆయన వెంట ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ రవిప్రకాశ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ ఆంజనేయులు, వైస్‌చైర్మన్‌ కిష్టయ్య, ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ చందు ఉన్నారు. 


Updated Date - 2021-05-18T07:06:09+05:30 IST