విజయగర్జనకు 50వేల మందిని తరలిస్తాం

ABN , First Publish Date - 2021-10-29T06:48:35+05:30 IST

వరంగల్‌లో నిర్వహించే విజయగర్జన సభకు నియోజకవర్గం నుంచి 50 వేల మంది కార్యకర్తలను తరలిస్తానని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌, టెస్కాబ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి తెలిపారు.

విజయగర్జనకు 50వేల మందిని తరలిస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత

ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి

యాదాద్రిరూరల్‌, అక్టోబరు 28: వరంగల్‌లో నిర్వహించే విజయగర్జన సభకు నియోజకవర్గం నుంచి 50 వేల మంది కార్యకర్తలను తరలిస్తానని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌, టెస్కాబ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని వంగపల్లిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. కార్యకర్తలు పార్టీ నిబంధనలను పాటించాలని లేకుంటే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులను వారు సన్మానించారు. సమావేశంలో ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, ఆల్డా చైర్మన్‌ మోతే పిచ్చిరెడ్డి, జడ్పీటీసీ అనురాధ, మునిసిపల్‌ చైర్మన  సుధామహేందర్‌గౌడ్‌, పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, నాయకులు శ్రీనివా్‌సగౌడ్‌, నరేందర్‌రెడ్డి, వెంకటే్‌షగౌడ్‌, శ్రీధర్‌గౌడ్‌, స్వామి పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-29T06:48:35+05:30 IST