మేము బీహార్ వెళ్లిపోతాం
ABN , First Publish Date - 2021-11-22T05:13:49+05:30 IST
ఉపాధి కోసం రాష్ర్టాలు దాటి వచ్చిన హమాలీలకు పని లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నెల రోజులవుతున్నా పని లేదు
ప్రారంభం కాని ధాన్యం కొనుగోళ్లు
పనులు లేక ఇబ్బందులు పడుతున్న బీహార్ హమాలీ కార్మికులు
చౌటుప్పల్‌రూరల్, నవంబరు 21: ఉపాధి కోసం రాష్ర్టాలు దాటి వచ్చిన హమాలీలకు పని లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రావడంతో ఉపాధి దొరుకుతుందన్న ఆశతో బీహార్ నుంచి వచ్చిన కూలీలకు పనులు లేక పస్తులు ఉంటు న్నా రు. రాష్ట్రంలో వర్షాకాలం పంటలు సమృద్ధిగా పండటంతో ధాన్యం దిగుబడి అధికంగా వచ్చింది. దీంతో హమాలీ పనులకు భారీగా డిమాండ్ ఉంటుందన్న ఆశతో బీహార్ నుంచి పెద్ద సంఖ్యలో హమాలీ కార్మికులు తరలివచ్చారు. నెల రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గుడారాలు వేసుకున్నారు. కానీ ఽధాన్యం కొనుగోలు లేకపోవడంతో ఇటు రైతులతో పాటు, వలస వచ్చిన హమాలీలు ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం రోజులు కొనుగోళ్లు ప్రారంభం కాకపోతే తా ము సొంత ప్రాంతాలకు వెళ్లిపోతామని చెబుతున్నా రు. చౌటుప్పల్, భూదానపోచంపల్లి, వలిగొండ తదతర ప్రాంతాల్లో వరి ధాన్యం దిగుబడి అధికంగా వస్తుంది. ఇక్కడ హమాలీల కొరత ఉండటంతో ధాన్యం కాంటా వేసేందుకు బీహార్ నుంచి హమాలీలను రప్పించేవారు. ఈ దఫా ధాన్యం మరింత దిగుబడి రావడం తో నెల రోజుల క్రితమే బీహార్ నుంచి హమాలీలు చౌటుప్పల్‌తో పాటు వివిధ ప్రాంతాలకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కొనుగోలు కేంద్రాల వద్ద గుడారాలు వేసుకున్నారు. పని దొరుకుతుందనే ధీమాతో సాధారణ ఖర్చుల కోసం కొద్ది మొత్తమే తెచ్చుకున్నారు. నెల రోజులవడంతో తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. పను లు లేక పస్తులు ఉండాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. గతంలో 40 నుంచి 50 రోజుల్లో కొనుగోలు పూర్తయ్యేవి. 50 రోజులకు రూ.50 వేలు సంపాదించి మళ్లీ తిరిగి ఇంటికి వెళ్లేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. నెల రోజులు దాటినా ఇంత వరకూ ఏ ప్రాంతంలోనూ కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ఎప్పుడు ప్రారంభమవుతాయో కూడా తెలియని పరిస్థితి. ఒకవేళ ప్రారంభించినా ఎన్ని రోజులు పడుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని బీహార్ హమాలీలు ఆందోళన చెందుతున్నారు. గతంలో రోజుకు రూ.1000 నుంచి రూ.1500 వరకు గిట్టుబాటు అయ్యేదని చెబుతున్నారు. ఇలా మందకొడిగా కొనసాగితే సగటున రూ. 200 కూడా గిట్టుబాటు కావడం కష్టమేనని వాపోతున్నారు. నిర్వాహకులు హమాలీలకు క్వింటాల్‌కు రూ. 32 చెల్లిస్తున్నారు. ధాన్యం కొనుగోలు పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము తమ రాష్ట్రానికి వెళ్లిపోతామని చెబుతున్నారు. రైతులు ధాన్యం రాశుల వద్ద, హమాలీలు గుడారాల వద్ద రాత్రీపగలు కాపుకాస్తూ ధాన్యం కొనుగోలు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
వచ్చి నెల రోజులు అవుతుంది
బబ్లూ, హమాలీ కార్మికుడు, బీహార్
ప్రతి సీజనలో మేము బీహార్ నుంచి వచ్చి హమాలీ పనిచేస్తాం. ఈసారి ధాన్యం ఎక్కవగా పండిందని చెప్పడంతో నెల రోజుల క్రితమే అ నేక మంది కార్మికులం ఇక్కడికి వచ్చాం. మేము వ చ్చి నెల రోజులు అవుతున్నా నేటికి ధాన్యం కొనుగో లు ప్రారంభం కాలేదు. నెలరోజులుగా పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఈసారి ధాన్యం కొ నుగోలు చేయ డం చాలా ఆలస్యమవుతుందని చె బుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మా గ్రామానికి వెళ్లి పోతాం.
ప్రాణసంకటంగా మారిన పాములు
చౌటుప్పల్‌టౌన: కొనుగోలు కేంద్రాల వద్ద గుడారాలు వేసుకొని తూకాలు వేస్తున్న హమాలీలకు పా ముల బెడద ప్రాణసంకటంగా మారింది. శనివారం రా త్రి తాళ్లసింగారం, ఎల్లంబావి గ్రామాల్లోని హమాలీల గుడారాలలోకి నాలుగు పాములు చేరుకున్నాయి. వీటిని గమనించిన హమాలీలు వెంటనే చంపివేశారు. దీంతో వారు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయ భూముల్లో వేసుకున్న గుడారాలలోకి తరచుగా పాములు చేరుకుంటున్నాయి.
