ధరలు తగ్గించే వరకు పోరాడతాం: కనగాల
ABN , First Publish Date - 2021-02-27T04:52:10+05:30 IST
పెంచిన డీజిల్, పెట్రో ధరలు తగ్గించే వరకూ పోరాడతామని కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కనగాల నాగేశ్వరరావు అన్నారు.

కోదాడటౌన్, ఫిబ్రవరి 26 : పెంచిన డీజిల్, పెట్రో ధరలు తగ్గించే వరకూ పోరాడతామని కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కనగాల నాగేశ్వరరావు అన్నారు. భారత్‌బంద్‌లో భాగంగా శుక్రవారం కోదాడలో లారీ అసోసియేషన్ సభ్యులతో పాటు సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, కార్ల యూనియన్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాతో కుదేలైన రవాణారంగాన్ని డీజిల్ ధర పెంచి కేంద్ర ప్రభుత్వం మరింత ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. కార్యక్రమంలో తూనం కృష్ణ, పయిడిమర్రి వెంకటనారాయణ, రామినేని శ్రీనివాసరావు, గుండపనేని నాగేశ్వరరావు, అంజయ్య, రామారావు, బుర్రి శ్రీరాములు, ఓరుగంటి ప్రభాకర్, ఉప్పగండ్ల శ్రీనివాసరావు, పార సీతయ్య, శ్రీనివాసరావుఎ్‌సకె లతీఫ్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.