నకిరేకల్ రూపురేఖలు మారుస్తాం
ABN , First Publish Date - 2021-05-08T07:21:15+05:30 IST
నకిరేకల్ మునిసిపాలిటీ రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం నుంచి అధికంగా నిధులు కేటాయిస్తామని రాష్ట్ర విద్యుత్‌శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. నకిరేకల్ మునిసిపాలిటీకి నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్‌చైర్మన్‌తో పాటు టీఆర్ఎస్ కౌన్సిలర్లను స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా అభినందించారు.

మంత్రి జగదీ్‌షరెడ్డి
నకిరేకల్, మే 7: నకిరేకల్ మునిసిపాలిటీ రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం నుంచి అధికంగా నిధులు కేటాయిస్తామని రాష్ట్ర విద్యుత్‌శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. నకిరేకల్ మునిసిపాలిటీకి నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్‌చైర్మన్‌తో పాటు టీఆర్ఎస్ కౌన్సిలర్లను స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మునిసిపాలిటీల మాదిరిగానే నకిరేకల్ మునిసిపాలిటీని అభివృద్ధి చేస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధే ధ్యేయంగా అభివృద్ధి చేసేందుకు నిరంతరం ముందు ఉంటుందన్నారు. గ్రామపంచాయతీల అభివృద్ధి ఒక విధంగా మునిసిపాలిటీల అభివృద్ధి అధికంగా ఉంటుందన్నారు. ప్రజలు విశ్వాసంతో ఓట్లు వేసి ఎక్కువ సీట్లలో అభ్యర్థులను గెలిపించినందునే మునిసిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఏకగ్రీవం చేసుకున్నామన్నారు. నూతనంగా ఎన్నికైన వారు మునిసిపాలిటీని అభివృద్ధి చేసేందుకు అన్ని రకాలుగా కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బాలసాని లక్ష్మినారాయణ, తుంగతుర్తి ఎమ్మెల్యే గాధరి కిషోర్‌కుమార్, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, నకిరేకల్ మార్కెట్ చైర్ పర్సన్ నడికుడి ఉమారాణి వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ మాధ ధనలక్ష్మి నగేష్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా చైర్మన్‌కు, వైస్ చైర్‌పర్సన్‌కు సన్మానం
మునిసిపాలిటీకి నూతనంగా ఎన్నికైన చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ మురారిశెట్టి ఉమారాణిని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్వీట్లు పంపిణీ చేసి అభినందించారు.