ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు ఉద్యమిస్తాం

ABN , First Publish Date - 2021-07-08T06:59:30+05:30 IST

ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు పోరాడుతామని పలువురు ఎమ్మార్పీఎస్‌ నాయకులు అన్నారు.

ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు ఉద్యమిస్తాం
భువనగిరిలో ఎమ్మార్పీఎస్‌ జెండా ఎగురవేస్తున్న రాంచంద్రయ్య

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, జూలై 7 :  ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు పోరాడుతామని పలువురు ఎమ్మార్పీఎస్‌ నాయకులు అన్నారు. జిల్లావ్యాప్తంగా ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భం గా సంఘాలు జెండాలు ఆవిష్కరించారు. భువనగిరిలో నిర్వహించిన వేర్వేరు కార్యక్రమాల్లో దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు బట్టు రాంచంద్రయ్య, ఎమ్మార్పీఎస్‌ టీఎస్‌ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యుడు చిలుకమారి గణేష్‌ మాదిగ జెండాలు ఎగురవేసి ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు ఉద్యమించాలన్నారు. ఆలేరులో సంఘం నియోజకవర్గ ఇనచార్జి  క్యాసగల్ల రమేష్‌  జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ సాధనే ఎమ్మార్పీఎస్‌ లక్ష్యమన్నారు. వలిగొండలో సంఘం జెండాను మండల నాయకులు ఆవిష్కరించారు. యాదగిరిగుట్టలో సంఘం మండల అధ్యక్షుడు గు ర్రం మహేందర్‌ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షుడు మీసాల ఉప్పలయ్య ఎమ్మార్పీఎస్‌ జెండా ఆవిష్కరించారు. సంస్థాననారాయణపురం, చౌటుప్పల్‌, మోటకొండూరు, రాజాపేట మండలాల్లో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Updated Date - 2021-07-08T06:59:30+05:30 IST