జనార్థన్ ఆశయ సాధనకు కృషి చేయాలి
ABN , First Publish Date - 2021-05-24T06:22:48+05:30 IST
సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు జె. జనార్థన్ ఆశయ సాధనకు కార్యకర్తలు కృషిచేయాలని అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కోటేశ్వరరావు కోరారు.

కోదాడలో నివాళులర్పిస్తున్న నాయకులు
కోదాడటౌన్/ ఆత్మకూర్(ఎస్)/ నాగారం/గరిడేపల్లి రూరల్, మే 23: సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు జె. జనార్థన్ ఆశయ సాధనకు కార్యకర్తలు కృషిచేయాలని అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కోటేశ్వరరావు కోరారు. ఆదివారం కోదాడలో జనార్థన్ సంతాపసభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పోటు లక్ష్యయ్య, వి. ప్రభాకర్, ఆర్. రామనర్సయ్య, ఉదయగిరి, నగేష్, నరసింహారావు, సాలమ్మ, జానకి పాల్గొన్నారు. ఆత్మకూర్(ఎస్) మండలంలోని తుమ్మలపెన్‌పహాడ్‌లో జరిగిన జనార్థన్ సంతాపసభలో నాయకులు గంట నాగయ్య, నల్లగొండ నాగయ్య, అల్గుబెల్లి వెంకట్‌రెడ్డి, నర్సమ్మ, లింగయ్య, వీరయ్య, యల్లయ్య, సాయిలు, రాములు, సోమయ్య పాల్గొన్నారు. నాగారం మండలం కొత్తపల్లిలో జరిగిన సంతాపసభలో నాయకులు బొడ్డు శంకర్, సంపెట కాశయ్య, సుధాకర్‌రెడ్డి, లింగయ్య, కృష్ణమూర్తి, గట్టయ్య పాల్గొన్నారు. గరిడేపల్లి మండలంలోని వెలిదండలో జరిగిన కార్యక్రమంలో నాయకులు పోటు లక్ష్మయ్య, ఆదూరి కోటయ్య, కనకారావు, రాజు, అనసూర్య, తిరపయ్య, శ్రీను, సైదులు, రవి, జయరాజు, రవి పాల్గొన్నారు.