ఐకేపీ సిబ్బంది తీరుతో నష్టపోయాం.. ఆదుకోండి : రైతులు

ABN , First Publish Date - 2021-08-10T06:02:48+05:30 IST

ఐకేపీ సిబ్బంది ధాన్యం కోత విధించడంతో నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్థానిక వెలుగు కార్యాలయం ఎదుట సోమవారం రైతులు ధర్నా నిర్వహించారు.

ఐకేపీ సిబ్బంది తీరుతో నష్టపోయాం.. ఆదుకోండి : రైతులు
వెలుగు కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న రైతులు

నూతన్‌కల్‌, ఆగస్టు 9 : ఐకేపీ సిబ్బంది ధాన్యం కోత విధించడంతో నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్థానిక వెలుగు కార్యాలయం ఎదుట సోమవారం రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ఏ కేంద్రంలో విధించని విధంగా నూతనకల్‌ ఐకేపీ కేంద్రంలో ఒక్కో రైతు నుంచి 10 నుంచి 20 క్వింటాళ్ల వరకు కోత విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను దోచుకుంటున్న మిల్లర్లను, అలసత్వం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు లేకపోవడంతో కార్యాలయానికి తాళంవేసి తాళాలను తహసీల్దార్‌ జమీరుద్దీన్‌కు అప్పగించారు. కార్యక్రమంలో రైతులు తీగల మల్లారెడ్డి, కట్ట మల్లారెడ్డి, కందాల శంకర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కొలగాని వెంకన్న, శ్రీనివా్‌సరెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-08-10T06:02:48+05:30 IST