పాల ఉత్పత్తిలో మనమే ప్రథమం

ABN , First Publish Date - 2021-08-20T06:49:46+05:30 IST

రాష్ట్రంలో పాల ఉత్పత్తిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌, టెస్కాబ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. స్థానికంగా గురువారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి పాల ఉత్పత్తి సంఘాల చైర్మన్ల సన్మాన సభలో వారు మాట్లాడారు.

పాల ఉత్పత్తిలో మనమే ప్రథమం
గుట్ట సన్మాన సభలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత

ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి


యాదాద్రి రూరల్‌, ఆగస్టు 19: రాష్ట్రంలో పాల ఉత్పత్తిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌, టెస్కాబ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. స్థానికంగా గురువారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి పాల ఉత్పత్తి సంఘాల చైర్మన్ల సన్మాన సభలో వారు మాట్లాడారు. కరువు కాటకాల్లో పాడిని నమ్ముకొని రైతులు రోజుకు 5.60 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి చేస్తూ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారని అన్నారు. గతంలో నియోజకవర్గంలో 14వేల లీటర్ల పాల ఉత్పత్తి ఉండగా, అది నేడు 2.50లక్షల లీటర్లకు చేరిందన్నారు. దీనికి పాడిరైతుల కృషి ఎంతో ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలో 347 పాలసంఘాల చైర్మన్లు ఉన్నారని, అందులో జిల్లాలో 147 మంది ఉన్నారన్నారు. ఎక్కువ శాతం చైర్మన్లు ఉన్న జిల్లా మనదేనని, వచ్చే మదర్‌డెయిరీ ఎన్నికల్లో చైర్మన్‌ పదవిని జిల్లా వాసులే కైవసం చేసుకోవాలన్నారు. పాల ఉత్పత్తి సంఘాల చైర్మన్లు ఐక్యంగా ఉండాలని, కొంతమంది నాయకులు సంఘాలను విచ్ఛీనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అలాంటి వారికి బుద్ధి చెప్పాలన్నారు. కరోనా విపత్తు పరిస్థితుల్లో సైతం రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ పలు పథకాలు అమలుచేస్తున్నారన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే నిధులు, వారికి అందాల్సిన వేతనాలు సైతం నిలిపి రైతులను ఆదుకున్న ఘనత ప్రభుత్వానికే దక్కిందన్నారు. అనంతరం పాల ఉత్పత్తి సంఘాల చైర్మన్లను సన్మానించారు. కార్యక్రమంలో ఆల్డా చైర్మన్‌ మోతె పిచ్చిరెడ్డి, ఆలేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, జడ్పీటీసీ సభ్యురాలు తోటకూరి అనురాధబీరయ్య, మదర్‌డెయిరీ డైరెక్టర్లు కళ్లెపల్లి శ్రీశైలం, రాంరెడ్డి, గాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-20T06:49:46+05:30 IST