కేజీబీవీ వర్కర్ల వేతనాలు పెంచాలి

ABN , First Publish Date - 2021-10-29T06:13:05+05:30 IST

కస్తూర్బా బాలికల విద్యాలయ(కేజీబీవీ) బోధనేతర సిబ్బంది, వర్కర్ల వేతనాలను జీవో నెం.60 ప్రకారం పెంచా లని ప్రగతిశీల కేజీబీవీ నాన్‌ టీచింగ్‌, వర్కర్స్‌ అసోసియేషన్‌ ఐఎఫ్‌ టీయూ జిల్లా అధ్యక్షుడు కామళ్ల నవీన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గరిడేపల్లిలో కేజీబీవీ పాఠశాల ఎదుట ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో గురు వారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

కేజీబీవీ వర్కర్ల వేతనాలు పెంచాలి
గరిడేపల్లిలో కస్తూర్బా పాఠశాల ఎదుట నిరసన తెలుపుతున్న టీచర్లు

గరిడేపల్లి, అక్టోబరు 28:  కస్తూర్బా బాలికల విద్యాలయ(కేజీబీవీ) బోధనేతర సిబ్బంది, వర్కర్ల వేతనాలను జీవో నెం.60 ప్రకారం పెంచా లని ప్రగతిశీల కేజీబీవీ నాన్‌ టీచింగ్‌, వర్కర్స్‌ అసోసియేషన్‌ ఐఎఫ్‌ టీయూ జిల్లా అధ్యక్షుడు కామళ్ల నవీన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గరిడేపల్లిలో కేజీబీవీ పాఠశాల ఎదుట ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో గురు వారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  కేజీ బీవీ సిబ్బందికి, వర్కర్లకు  30 శాతం పీఆర్సీ అమలు చేస్తామని కేసీఆర్‌ ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టియు జిల్లా నాయకులు శివ, ఉమా, లక్ష్మి, నాగేంద్ర, అంజమ్మ,పాల్గొన్నారు. Updated Date - 2021-10-29T06:13:05+05:30 IST