అంగన్‌వాడీలకు వేతనాలు పెంపు హర్షణీయం

ABN , First Publish Date - 2021-08-20T06:09:51+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ సిబ్బందికి 30 శాతం వేతనాలు పెంచడం హర్షణీయమని టీఆర్‌ఎ్‌సకేవీ జిల్లా అధ్యక్షుడు వెంపటి గురూజీ అన్నారు.

అంగన్‌వాడీలకు వేతనాలు పెంపు హర్షణీయం
సూర్యాపేటలో కేసీఆర్‌, కేటీఆర్‌, జగదీష్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న అంగన్‌వాడీలు

సూర్యాపేటటౌన్‌, ఆగస్టు 19 : రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ సిబ్బందికి 30 శాతం వేతనాలు పెంచడం హర్షణీయమని టీఆర్‌ఎ్‌సకేవీ జిల్లా అధ్యక్షుడు వెంపటి గురూజీ అన్నారు. అంగన్‌వాడీ సిబ్బందితో కలసి జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, జగదీ్‌షరెడ్డి చిత్రపటాలకు గురువారం క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీల వేతనాలు పెంచేలా కృషి చేయాలన్నారు. అంగన్‌వాడీ టీచర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు తాటిపాముల నాగలక్ష్మి, సుజాత, జ్యోతి, విజయనిర్మల, సావిత్రి, చంద్రకళ, శైలజ, సంధ్య, రమణ పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-20T06:09:51+05:30 IST