యువతకు స్ఫూర్తిప్రదాత వివేకానంద

ABN , First Publish Date - 2021-01-13T06:13:13+05:30 IST

యువతకు స్ఫూప్రదాత స్వామివివేకానంద.. మహాపురుషుడి భోదనలను ఆదర్శంగా తీసుకుని నేటి యువత సన్మార్గంలో నడిచి దేశ అభివృద్దికి పాటుపడాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ కోరారు.

యువతకు స్ఫూర్తిప్రదాత వివేకానంద
భువనగిరిలో వివేకానందుడి విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌

యాదాద్రి(ఆంధ్రజ్యోతి)/ భువనగిరి రూరల్‌/ చౌటుప్పల్‌ టౌన్‌/ వలిగొండ, ఆత్మకూరు(ఎం), బీబీనగర్‌/ రామన్నపేట/ మోత్కూరు/ రాజాపేట/ ఆలేరు, జనవరి12: యువతకు స్ఫూప్రదాత స్వామివివేకానంద.. మహాపురుషుడి భోదనలను ఆదర్శంగా తీసుకుని నేటి యువత సన్మార్గంలో నడిచి దేశ అభివృద్దికి పాటుపడాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ కోరారు. మంగళవారం స్వామివివేకానంద జయంతి పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు.  భువనగిరి పట్టణంలోని ఆయన విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. భారతదేశ సంస్కృతిని, ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటిన మహనీయుడు అన్ని కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ జడల అమరేందర్‌, డీఆర్‌డీవో మందడి ఉపేందర్‌రెడ్డి, ఆర్డీవో ఎంవీ భూపాల్‌రెడ్డి, నాగేందర్‌ పాల్గొన్నారు. భువనగిరి పట్టణంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలరు.  కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు కె. రమే్‌ష,నర్సింగ్‌, క్రిష్ణాచారి, బీజేపీ నాయకులు గూడూరు నారాయణరెడ్డి, నర్ల నర్సింగరావు, చందా మహేందర్‌, సుర్వీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  యువటీమ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కన్వీనర్‌ సూదగాని రాజు, పొన్న వినోద్‌, బండారు రఘు పాల్గొన్నారు.  దేశంలోపెరుగుతున్న నిరుద్యోగాన్ని నిరసిస్తూ ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో బూట్‌పాలిష్‌ చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మంగ ప్రవీణ్‌, సుర్పంగ చందు, బి. ఉపేందర్‌గౌడ్‌, శరత్‌, సాయి పాల్గొన్నారు. భువవనగిరి మండలంలోని వీరవెల్లి, నమాత్‌పల్లి, రాయిగిరి గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. చౌటుప్పల్‌, వలిగొండ, ఆత్మకూరు(ఎం), బీబీనగర్‌, రామన్నపేట, మోత్కూరు, భూదాన్‌పోచంపల్లి, సంస్థాన్‌నా రాయణపూరం,  రాజాపేట, ఆలేరు మండలాల్లో వివేకానందుడి చిత్రపటాలు, విగ్రహాల వద్ద నివాళులర్పించారు. 

Updated Date - 2021-01-13T06:13:13+05:30 IST