వీసా జాప్యంతో మనస్తాపానికి గురై..
ABN , First Publish Date - 2021-10-20T06:28:26+05:30 IST
విదేశాల్లో విద్యనభ్యసించడానికి వెళ్లేందుకు వీసా జాప్యం కావడంతో మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడు చర్లలో మంగళవారం జరిగింది. ఎస్‌ఐ విజయ్‌ప్రకాష్ తెలిపిన వివరాల

నేరేడుచర్ల, అక్టోబరు 19: విదేశాల్లో విద్యనభ్యసించడానికి వెళ్లేందుకు వీసా జాప్యం కావడంతో మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడు చర్లలో మంగళవారం జరిగింది. ఎస్‌ఐ విజయ్‌ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నల్లగంతుల వెంకటేశ్వర్లు కుమారుడు గోపి(19) పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. విదేశీ విద్య కోసం ఇటలీకి వెళ్లేందుకు పాస్‌పోర్టు తీసుకున్నాడు. అక్కడి కళాశాలలో అడ్మిషన్ పొందాడు. కరోనా ప్రభావంతో వీసా జాప్యం కావడంతో మన స్తాపానికి గురైన గోపి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసున్నాడు. గోపి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.