వినోబాభావే ఆశయాలు విశ్వవ్యాప్తం చేయాలి
ABN , First Publish Date - 2021-11-21T06:38:16+05:30 IST
భూదానోద్యమ పిత ఆ చార్య వినోబాభావే ఆశయాలను విశ్వవ్యాప్తం చేయాలని ఏఐసీసీ రాజీవ్‌గాంధీ పంచాయతీ సంఘటన తెలంగాణ, ఆంధ్రప్రదేశ ఇనచార్జి కి రణ్ ముగబసవ అన్నా రు.

భూదానపోచంపల్లి, నవంబరు 20: భూదానోద్యమ పిత ఆ చార్య వినోబాభావే ఆశయాలను విశ్వవ్యాప్తం చేయాలని ఏఐసీసీ రాజీవ్‌గాంధీ పంచాయతీ సంఘటన తెలంగాణ, ఆంధ్రప్రదేశ ఇనచార్జి కి రణ్ ముగబసవ అన్నా రు. పోచంపల్లిలోని రూ రల్ టూరిజం సెంటర్‌ను, మ్యూజియంలోని వినోబాభావే ఫొటో గ్యాలరీని శనివా రం ఆయన సందర్శించి మాట్లాడారు. ఆనాడు భూదానగంగోత్రి పోచంపల్లి నుం చి వినోబాభావే మొదలుపెట్టిన పాదయాత్ర మహారాష్ట్రలోని వార్థ వరకు సుమా రు 600 కిలోమీటర్ల పాదయాత్ర సాగిందని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 30 వ తేదీన ఏఐసీసీ, వినోబా ఆశ్రమం ప్రతినిధులతో కలిసి పోచంపల్లి నుంచి వా ర్ధా వరకు యాత్ర కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయనతో పాటు పీసీసీ అధికార ప్రతినిధి సద్ధేశ్వర్, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు పాక మల్లే్‌షయాదవ్, గునిగంటి రమే్‌షగౌడ్, నాయకులు వెంకటేష్ పాల్గొన్నారు.