చైన్‌ స్నాచింగ్‌ ముఠాను పట్టుకున్న గ్రామస్థులు

ABN , First Publish Date - 2021-07-08T06:27:46+05:30 IST

బైక్‌పై వచ్చి చైన్‌ స్నాచింగ్‌ చేసి పరారవుతున్న ఇద్దరు యువకులను మిర్యాలగూడ మండలం తంగపాడు గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

చైన్‌ స్నాచింగ్‌ ముఠాను పట్టుకున్న గ్రామస్థులు

 పోలీసులకు అప్పగింత

మిర్యాలగూడ రూరల్‌, జూలై 7: బైక్‌పై వచ్చి చైన్‌ స్నాచింగ్‌ చేసి పరారవుతున్న ఇద్దరు యువకులను మిర్యాలగూడ మండలం తంగపాడు గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తుంగపాడు గ్రామ శివారులో బుధవారం  ఓ మహిళ నడుచుకుంటూ వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కెళుతుండగా వారిని గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ వ్యక్తులు అంతర్రాష్ట ముఠాలోని సభ్యులగా స్థానికులు అనుమానిస్తున్నారు. మిర్యాలగూడ మండలంలోని తుంగపాడు నుంచి అడవిదేవులపల్లి వెళ్లే దారిలో ఆరు నెలలుగా  చైన్‌ స్నాచింగ్‌లు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా కేసు దర్యాప్తులో ఉందని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. 



Updated Date - 2021-07-08T06:27:46+05:30 IST