గ్రామాలే ఉద్యమ కేంద్రాలు: తమ్మినేని

ABN , First Publish Date - 2021-07-24T06:25:39+05:30 IST

పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ఇబ్బందులు పెడుతున్నందున ప్రజానీకాన్ని సేకరించి పోరాటం చేయడానికి గ్రామాలనే ఉద్యమకేంద్రాలుగా చేసుకుని పోరాటం చేయడానికి సీపీఎం శాఖలు సిద్ధంగా ఉండాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

గ్రామాలే ఉద్యమ కేంద్రాలు: తమ్మినేని
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం

మిర్యాలగూడ రూరల్‌, జూలై 23: పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ఇబ్బందులు పెడుతున్నందున ప్రజానీకాన్ని సేకరించి పోరాటం చేయడానికి గ్రామాలనే ఉద్యమకేంద్రాలుగా చేసుకుని పోరాటం చేయడానికి సీపీఎం శాఖలు సిద్ధంగా ఉండాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం మండలంలోని బండి కన్వెన్షన్‌లో జరిగిన గూడూరు ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధి గ్రామశాఖల మహాసభలో ఆయన మాట్లాడారు.  కుల, మతాలకు అతీతంగా సోదరభావంతో మెలిగే గ్రామాల్లో విచ్ఛిన్న శక్తులకు అవకాశం ఇవ్వకుండా ప్రజలను చైతన్యపరిచి లౌకికవాద వ్యవస్థ ఏర్పాటుకు పాటుపడాలన్నారు. జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ చరిత్రలో విజయవంతమైన పోరాటాలు అన్నీ ఎర్రజెండా నాయకత్వంలోనే జరిగాయన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-24T06:25:39+05:30 IST