వామ్మోచలి

ABN , First Publish Date - 2021-12-19T05:36:28+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వారం రోజులుగా చలి తీవ్రత అధికమైంది. రోజురోజుకూ కనిష్ఠ ఉష్ణోగ్రత పడిపోతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానం గా చిన్నారులు, వృద్ధులు తల్లడిల్లుతున్నారు. సాయంత్రం 5గంటల నుంచి మొదలు మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు వాతావరణం చల్లగానే ఉంటోంది. పగ టి పూట కూడా చలి తగ్గడం లేదు.

వామ్మోచలి

14డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

ఇబ్బందులు పడుతున్న చిన్నారులు,వృద్ధులు


నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వారం రోజులుగా చలి తీవ్రత అధికమైంది. రోజురోజుకూ కనిష్ఠ ఉష్ణోగ్రత పడిపోతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానం గా చిన్నారులు, వృద్ధులు తల్లడిల్లుతున్నారు. సాయంత్రం 5గంటల నుంచి మొదలు మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు వాతావరణం చల్లగానే ఉంటోంది. పగ టి పూట కూడా చలి తగ్గడం లేదు. సూర్యాపేట జిల్లా లో శనివారం 14డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.



ఉమ్మడి జిల్లాలో చలికితోడు మంచు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.  నైరుతి రుతుపవనాలు తిరోగమనంతో పగటి ఉష్ణోగ్రతలు పడిపోయి రాత్రి వేళలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చలి కారణంగా పిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్థులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. మార్నింగ్‌ వాకర్స్‌ ఉదయం 6.30గంటల తరువాతే బయటికి వస్తున్నా రు. వేసవిలో తెల్లవారుజాము 4గంటల నుంచి నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల, సూ ర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల గ్రౌండ్‌, ఎస్వీ డిగ్రీ కళాశాల గ్రౌండ్‌, నూతన వ్యవసాయ మార్కెట్‌, కుడకుడ రోడ్డు, పాత, నూతన జాతీయ రహదారులు, సద్దుల చెరువు మినీట్యాంక్‌బండ్‌పై మార్నింగ్‌ వాకర్స్‌ సందడి ఉండేది. ప్రస్తు తం ఉదయం 6.30గంటల తరువాతే వాకర్స్‌ సందడి కనిపిస్తోంది.


చలితో జర భద్రం

చలి కారణంగా విషజ్వరాలు తొందరగా ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో జలుబు, దగ్గుతోపాటు న్యుమోనియా వచ్చే అవకాశం ఉంది. కీళ్ల నొప్పులు, అస్తమా, చర్మవ్యాధులు, గుండెపోటు ఉన్న వృద్ధులు చలిలో బయటికి రాకపోవడమే ఉత్తమమని చెబుతున్నారు. వీలైనంత మేర చలి తగ్గాకే వాకింగ్‌ వెళ్లాలని, శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే ఉన్ని దుస్తులు ధరించాలని, చల్లని గాలి చెవుల్లోకి వెళ్లకుండా మఫ్లర్‌, మంకీక్యాప్‌ వాడాలని సూచిస్తున్నారు. దీంతోపాటు శరీరం పొడిబారకుండా ఉండేందుకు మాయిశ్చరైజర్లు వాడితే మంచిది. త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినాలని, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి.


వారం రోజులుగా ఉష్ణోగ్రతలు ఇలా

తేదీ నల్లగొండ సూర్యాపేట యాదాద్రి

గరిష్ఠం కనిష్ఠం గరిష్ఠం కనిష్ఠం గరిష్ఠం కనిష్ఠం

12న 32.4 20.0 29.5 17.5 30.0 20.0

13న 31.0 21.0 30.4 17.2 28.0 19.0

14న 30.0 19.4 30.1 17.0 27.0 20.0

15న 30.5 19.0 31.5 17.2 28.0 16.0

16న 29.5 17.4 28.5 18.0 29.0 14.0

17న 29.5 17.0 29.0 15.0 29.0 14.0

18న 30.5 15.0 30.0 14.0 30.0 14.0

Updated Date - 2021-12-19T05:36:28+05:30 IST