వాల్మీకి మహర్షి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-10-21T06:02:43+05:30 IST

రామాయణ మహాకావ్యాన్ని రచించిన వాల్మీకి మహర్షి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. వాల్మీకి మహర్షి జయంతి సంద

వాల్మీకి మహర్షి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి: కలెక్టర్‌
సూర్యాపేటలో వాల్మీకి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ప్రజాప్రతినిధులు

సూర్యాపేటటౌన్‌ /ఆత్మకూర్‌(ఎస్‌) / హుజూర్‌నగర్‌ / మేళ్లచెర్వు / నూతనకల్‌ / నేరేడుచర్ల / అనంతగిరి / అక్టోబరు 20 : రామాయణ మహాకావ్యాన్ని రచించిన వాల్మీకి మహర్షి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, మాట్లాడారు. సత్‌ప్రవర్తనతో మంచి మార్గంలో నడవడానికి వాల్మీకి జీవితం ఒక చక్కటి ఉదాహరణ అని అన్నారు. జిల్లా కేంద్రంలోని మునిసిపల్‌ కార్యాలయ ఆవరణలో వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆత్మకూర్‌(ఎస్‌) మండల పరిషత్‌ కార్యాలయంలో వాల్మీకి జయంతి ఉత్సవాలు నిర్వహించారు.  కార్యక్రమంలో ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌, కిషోర్‌కుమార్‌, సీపీవో వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ శిరీష, శంకర్‌, ఏవో శ్రీదేవి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పుట్ట కిషోర్‌, మున్సిపల్‌ కమీషనర్‌ రామాంజులరెడ్డి, కౌన్సిలర్లు ఎలిమినేటి అభినయ్‌, రాపర్తి శ్రీనివా్‌సగౌడ్‌, కొండపల్లి దిలీ్‌పరెడ్డి, ఎంపీవో సంజీవయ్య, దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా హుజూర్‌నగర్‌లో ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి వాల్మీకి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎలక సోమయ్య, మహిపాల్‌, రాకేష్‌, జితేందర్‌, పప్పు, పెద్దబ్బాయి, నాగార్జున పాల్గొన్నారు. మేళ్లచెర్వులో ఎంపీడీవో ఇస్సాక్‌హుస్సేన్‌, ఎంపీవో వీరయ్య, ఏపీవో రాజు పాల్గొన్నారు. నూతనకల్‌లో తహసీల్దార్‌ జమీరుద్దీన్‌, డీటీ శ్రీధర్‌నాయక్‌, ఆర్‌ఐలు షరీఫ్‌, సుజిత్‌, జార్జిరెడ్డి, వీఆర్‌వోలు పాల్గొన్నారు. నేరేడుచర్లలో ఎంపీపీ లకుమళ్లజ్యోతి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఉపేందర్‌రెడ్డి, వైద్యాధికారులు నాగయ్య, హరికిషన్‌, ఎంపీవో విజయకుమారి, ఏపీయం అనురాధ, చిల్లేపల్లి సర్పంచ్‌ కొడిద మనోజ్‌ పాల్గొన్నారు. అనంతగిరిలో ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, తహసీల్ధార్‌ వాజీద్‌అలీ, జడ్పీటీసీ ఉమ, ఎంపీడీవో నాగేశ్వర్‌రావు, ఏపీవో శైలజ, జానకిరాంరెడ్డి, ఆర్‌ఐ గిరిప్రసాద్‌, గోలి జగదీష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-21T06:02:43+05:30 IST