సమష్టి కృషితోనే 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2021-10-29T05:56:35+05:30 IST
సమష్టి కృషితోనే దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా అన్నారు.
ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్‌భాటియా
బీబీనగర్, అక్టోబరు 28: సమష్టి కృషితోనే దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా అన్నారు. దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయిన సందర్భంగా ఎయిమ్స్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 130 కోట్ల జనాభా కలిగిన భారత దేశంలో అనతికాలంలోనే వంద కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేయడం హర్షణీయమన్నారు. అంతకుముందు ఎయిమ్స్ ప్రధాన ద్వారం ఎదుట ‘వ్యాక్సినేటెడ్ అమాంగ్ 100 క్రోర్స్’ అని రాసిన బెలూన్లను ఆకాశంలో ఎగురవేశారు.