సమస్యల పరిష్కారానికే ‘పట్టణ ప్రగతి’

ABN , First Publish Date - 2021-07-08T06:53:05+05:30 IST

సమస్యల పరిష్కారానికి పట్టణ ప్రగతి కార్యక్రమం వేదిక కావాలని కలెక్టర్‌ టి. వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణతో కలిసి జిల్లా కేంద్రంలోని పలువార్డుల్లో బుధవారం మొక్కలు నాటారు. ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలన్నారు.

సమస్యల పరిష్కారానికే ‘పట్టణ ప్రగతి’
సూర్యాపేటలో పట్టణ ప్రగతిలో భాగంగా సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌

కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి 


సూర్యాపేటటౌన్‌/ పెన్‌పహాడ్‌/ చివ్వెంల, జూలై 7: సమస్యల పరిష్కారానికి పట్టణ ప్రగతి కార్యక్రమం వేదిక కావాలని కలెక్టర్‌ టి. వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణతో కలిసి జిల్లా కేంద్రంలోని పలువార్డుల్లో బుధవారం మొక్కలు నాటారు. ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములవుతూ విరివిగా మొక్క లు నాటాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించే బా ధ్యతను తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ రామాంజులరెడ్డి, డీఈ సత్యారావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సారగండ్ల శ్రీనివాస్‌, కౌన్సిలర్‌లు చింతలపాటి భరత్‌మహజన్‌, పగిళ్ళ సుమిలారెడ్డి, రాపర్తి శ్రీనివా్‌సగౌడ్‌, మొరిశెట్టి సుధారాణి, కో-ఆప్షన్‌ మెంబర్‌ వెంపటి సురేష్‌, నాయకులు బైరు వెంకన్నగౌడ్‌, బైరు దుర్గయ్య, దేవయ్య ఉన్నారు. పెన్‌పహాడ్‌ మండల పరిధిలోని దుబ్బాతండా, మేగ్యాతండా, ధర్మాపురం గ్రామాల్లో కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి పర్యటించారు. మురుగుకాల్వలు, వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు, పల్లె ప్రకృతివనాలు, మొక్కలను పరిశీలించారు. పెండింగ్‌ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రాంపతినాయక్‌, ఎంపీవో ఆంజనేయులు, ఏపీవో రవి, సర్పంచ్‌ అంగోతు నాగమ్మ పాల్గొన్నారు. చివ్వెంల మండలంలోని వల్లభాపురంలో పల్లె ప్రకృతివనం, నర్సరీలను కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జమలారెడ్డి, సర్పంచ్‌ నాగలక్ష్మి పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-08T06:53:05+05:30 IST