యురేనియం తవ్వకాలను అడ్డుకోవాలి: సీపీఎం

ABN , First Publish Date - 2021-10-29T06:29:45+05:30 IST

మండల ప్రజలు చైతన్యవంతులై కేంద్ర ప్రభుత్వం చేపట్టే యురేనియం తవ్వకాలను అడ్డుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు.

యురేనియం తవ్వకాలను అడ్డుకోవాలి: సీపీఎం
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి సుధాకర్‌రెడ్డి

పెద్దఅడిశర్లపల్లి, అక్టోబరు 28: మండల ప్రజలు చైతన్యవంతులై కేంద్ర ప్రభుత్వం చేపట్టే  యురేనియం తవ్వకాలను అడ్డుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఘనిపల్లి గ్రామంలో  నిర్వహించిన పార్టీ మండల మహాసభకు ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీపీఎం ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేశామని, ప్రజలందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించారని అన్నారు. ఈ మధ్య కాలంలో మళ్లీ తవ్వకాలు నిర్వహించడం కోసం కేంద్ర బృందం సంచరించడంతో ప్రజల ఒత్తిడితో వెనక్కి వెళ్లారన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం రెండు రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చాయని, సామాన్యుడు మూడు పూటలా భోజనం చేసే పరిస్థితి లేకుండా కేంద్ర ప్రభుత్వం చేసిందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఐలయ్య, ఆనంద్‌, విజ య్‌, ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు శంకర్‌, వెంకటేష్‌, రవి, బిక్షమయ్య, లక్ష్మమ్మ, అంజయ్య, సుధాకర్‌, వినోద్‌, ముని పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T06:29:45+05:30 IST