గుర్తు తెలియని యాచకుడి మృతి

ABN , First Publish Date - 2021-07-08T07:01:58+05:30 IST

మోత్కూరు మార్కెట్‌ యార్డు షట్టర్ల వద్ద మంగళవారం రాత్రి గుర్తు తెలియని యాచకుడు మృతిచెందాడని ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌ తెలిపారు.

గుర్తు తెలియని యాచకుడి మృతి

మోత్కూరు, జూలై 7 : మోత్కూరు మార్కెట్‌ యార్డు షట్టర్ల వద్ద మంగళవారం రాత్రి గుర్తు తెలియని యాచకుడు మృతిచెందాడని ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌ తెలిపారు. మార్కెట్‌ యార్డులో నిర్మిస్తున్న షట్టర్లలో కొంతమంది యాచకులు రాత్రివేళ నిద్రిస్తున్నారని మార్కెట్‌ కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారన్నారు. రోజులాగానే బుధవారం ఆయన విధులకు వచ్చే సరికి గుర్తు తెలియని యాచకుడు షెట్టర్‌ వద్ద మృతి చెంది ఉన్నాడన్నారు. మృతుని వయస్సు 55-60 ఏళ్లు ఉంటుందని, 5.5అడుగుల ఎత్తు ఉంటాడని, మృతదేహంపై ఎరుపు రంగు చొక్కా, బ్లూ కలర్‌ కాటన లుంగీ ఉన్నాయన్నారు. శవాన్ని రామన్నపేట ఆస్పత్రిలోని మార్చూరీకి తరలించామని తెలిపారు. మార్కెట్‌ కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-07-08T07:01:58+05:30 IST