చౌటుప్పల్‌ ఏసీపీగా ఉదయ్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2021-08-27T06:42:26+05:30 IST

చౌటుప్పల్‌ ఏసీపీగా ఉదయ్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు.

చౌటుప్పల్‌ ఏసీపీగా ఉదయ్‌రెడ్డి  బాధ్యతల స్వీకరణ

చౌటుప్పల్‌ రూరల్‌, ఆగస్టు 26: చౌటుప్పల్‌  ఏసీపీగా ఉదయ్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. నిర్మల్‌ జిల్లా ఊట్నూర్‌ డీఎస్పీగా పనిచేస్తున్న ఉదయ్‌ రెడ్డి  చౌటుప్పల్‌ ఏసీపీగా బదిలీ ఆయ్యారు. ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన ఉదయ్‌రెడ్డిని సీఐలు శ్రీనివాస్‌, వెంకటయ్య పలువురు ఎస్‌ఐలు కలిసి శుభాకాం క్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు,  ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లో  ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థను పటిష్ఠంగా అమలు చేయానికి కృషి చేస్తానన్నారు.

భువనగిరి ఏసీపీగా సాయిరెడ్డి వెంకట్‌రెడ్డి 

భువనగిరి రూరల్‌: భువనగిరి ఏసీపీగా సాయిరెడ్డి వెంకట్‌రెడ్డిని నియమించారు. హైదరాబాద్‌ సీసీఎస్‌లో ఏసీపీగా పని చేస్తున్న ఆయన  బది లీపై భవనగిరికి వచ్చారు. ఇక్కడ పని చేస్తున్న ఏసీపీ ఎన్‌.భుజంగరావుకు ఇటీవల అడిషనల్‌ డీసీపీగా పదోన్నతి పొందారు. భువనగిరి ఏసీపీగా వెంకట్‌రెడ్డిని నియ మిస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. Updated Date - 2021-08-27T06:42:26+05:30 IST