రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2021-12-28T06:02:31+05:30 IST

ట్రాక్టర్‌ ఢీకొని నల్లగొండ పట్టణంలోని ఓ వ్యక్తి మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని దేవరకొండ రోడ్డు లో చైతన్యపురి కాలనీకి చెందిన బండారు లక్ష్మణ్‌కుమార్‌(40) కారు డ్రైవరు గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
నల్లగొండ టు టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులు

 మరో ముగ్గురికి గాయాలు

నల్లగొండ క్రైం/హాలియా/వేములపల్లి, డిసెంబరు 27: నల్లగొండ జిల్లాలో సోమవారం జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. 

ట్రాక్టర్‌ ఢీకొని..

ట్రాక్టర్‌ ఢీకొని నల్లగొండ పట్టణంలోని  ఓ వ్యక్తి మృతి చెందాడు.  బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..  పట్టణంలోని దేవరకొండ రోడ్డు లో చైతన్యపురి కాలనీకి చెందిన బండారు లక్ష్మణ్‌కుమార్‌(40) కారు డ్రైవరు గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.  దేవరకొండ రోడ్డులో  బైక్‌పై వెళుతుండగా,  పెట్రోల్‌ బంకు సమీపంలో వెనకాల నుంచి వస్తున్న ట్రాక్ట ర్‌ ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లక్ష్మణ్‌కుమార్‌ అక్కడిక క్కడే మృతి చెందాడు.  ట్రాక్టర్‌ డ్రైవరు, యజమానిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వన్‌టౌన్‌ సీఐ బాలగోపాల్‌ హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెపారు.

బైకు అదుపుతప్పి హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి..

బైకు అదుపుతప్పి హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి మృతి చెందారు. స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన మల్లోజు శేషగిరిచారి(58) బైక్‌పై బంధువుల ఇంటికి మండలంలో చల్మారెడ్డిగూడెంకు వెళుతూ, ఆ గ్రామ శివారులో  బైకు అదుపు తప్పి కిందపడ్డాడు. ఈ ప్రమా దంలో తలకు తీవ్రగాయాలైన శేషగిరిచారి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి భార్య ప్రకృతాంబ ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు  దర్యాప్తు చేస్తున్నారు. 

బైకును తప్పించబోయి ఆటో బోల్తా పడి ముగ్గురికి తీవ్రగాయాలు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గులపల్లి మండలం పోరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పోరెడ్డి నర్మద, మంజుల, అండెం అలివేలు అదే గ్రామానికి చెందిన జానీ పాషా ఆటోలో మిర్యాలగూడకు నుంచి పోరెడ్డిగూడెంకు బయలుదేరారు. వేములపల్లికి ఆటో రాగా, అదే సమయానికి మిర్యాలగూడ మండలం గోగు వారిగూడెంకు చెందిన బంగారం శ్రీను బైక్‌ మిర్యాలగూడకు వెళ్లే క్రమంలో రోడ్డును క్రాస్‌ చేస్తున్నారు.  బైక్‌ను తప్పించబోయి ఆటో డ్రైవర్‌ ఒక్కసారిగా  బ్రేక్‌ వేయ డంతో అదుపుతప్పి ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలకు తీవ్రంగా గాయపడ్డారు.


Updated Date - 2021-12-28T06:02:31+05:30 IST