రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు

ABN , First Publish Date - 2021-01-12T06:10:54+05:30 IST

నల్లగొండ జిల్లాలో ఆదివారం రాత్రి, సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు గాయపడ్డారు. కేతేపల్లి మండల కేంద్రంలో ఓ బాలుడు కనగల్‌ మండలం ఎస్‌లింగోటం స్టేజీ వద్ద పాస్టర్‌ గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు

నల్లగొండ జిల్లాలో ఆదివారం రాత్రి, సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు గాయపడ్డారు. కేతేపల్లి మండల కేంద్రంలో ఓ బాలుడు  కనగల్‌ మండలం ఎస్‌లింగోటం స్టేజీ వద్ద పాస్టర్‌ గాయపడ్డారు. 

కనగల్‌, జనవరి 11: మండలంలోని ఎస్‌లింగోటం గ్రామ స్టేజీ వద్ద ఆదివారం రాత్రి బైక్‌ను కారు ఢీకొట్టడంతో  పాస్టర్‌ గాయపడ్డారు. ఎస్‌ఐ సతీష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లి గ్రామానికి పాస్టర్‌ ఆంగోతు బాలాజీ- నాగమణి దంపతులు బైక్‌పై హాలియా మండలంలోని ఓ చర్చికి వెళ్తుండగా ఎస్‌లింగోటం స్టేజీ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈఘటనలో బాలాజీకి కుడి కాలు విరిగింది. నాగమణి ఫిర్యాదు మేరకు కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

కేతేపల్లి: కేతేపల్లి మండల కేంద్రంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమా దంలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కేతేపల్లికి చెందిన జటంగి నాగమ్మ కుమారుడు విష్ణు కాలి నడకన జాతీయ రహదారిని దాటుతుండగా నకిరేకల్‌ వైపు నుంచి సూర్యాపేట వైపునకు వెళుతున్న మోటార్‌సైకిల్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడి ఎడమ కాలు విరిగి ఎముకలు బయటకు వచ్చాయి. విష్ణును చికిత్స కోసం 108 అంబు లెన్సులో  సూర్యాపేట జనరల్‌ ఆసుపత్రికి తరలించారు.


Updated Date - 2021-01-12T06:10:54+05:30 IST