రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వృద్ధులు మృతి

ABN , First Publish Date - 2021-11-23T06:26:54+05:30 IST

జిల్లాలో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్ర మాదాల్లో ఇద్దరు వృద్ధులు మృతి చెందారు.

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వృద్ధులు మృతి

వలిగొండ, మోత్కూరు, నవంబరు 22: జిల్లాలో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్ర మాదాల్లో ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. ఈ ప్రమాదాలు వలిగొండ, మోత్కూరు మండలా ల్లో జరిగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం... మోత్కూరు మునిసిపాలిటీ కేంద్రంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన వృద్ధురాలు దామరోజు లక్ష్మమ్మ (90)మృతి చెందింది. సోమవారం మధ్యాహ్నం మెయిన రోడ్డు వెంట నడుస్తూ వెళ్తున్న లక్ష్మమ్మను గుర్తు తెలియని ద్విచక్ర వా హనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన లక్ష్మమ్మను వెంటనే మోత్కూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్‌ తెలిపారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని మృ తదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌ తెలిపారు. వలిగొండ మండలం పహిల్వానపురం మ దిర గ్రామం పల్లెవంపునకు చెందిన గూడూరు నర్సిరెడ్డి (70) తన సొం త పనిమీద టీవీఎస్‌ వాహనంపై వెళ్తున్నారు. ఆదివారం రాత్రి టేకులసోమారం వద్ద వెనుక నుంచి వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది. దీంతో నర్సిరెడ్డికి తీవ్రగాయాలవడంతో కుటుంబసభ్యులు భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుమారుడు రాజేశ్వర్‌రెడ్డి ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ సత్యం తెలిపారు.  


Updated Date - 2021-11-23T06:26:54+05:30 IST