రెండు బైక్‌లు ఢీకొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-12-30T06:35:37+05:30 IST

రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఒ కరు మృతిచెందగా, మ రో ఐదుగురికి గాయాల య్యాయి.

రెండు బైక్‌లు ఢీకొని ఒకరి మృతి
రోడ్డు ప్రమాదంలో ఎదురెదురుగా ఢీకొన్న ద్విచక్ర వాహనాలు

చందంపేట, డి సెంబరు 29: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఒ కరు మృతిచెందగా, మ రో ఐదుగురికి గాయాల య్యాయి. ఈ సంఘట న మండలంలోని ఇసుకబావి వద్ద బుధవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... డిండి మండల వైస్‌ ఎంపీపీ గోరేటి పుల్లమ్మ, భర్త అంజయ్య(55)తో కలిసి ద్విచక్ర వాహనంపై ఈ నెల 28న నేరేడుగొమ్ము మండలం పేర్వాలకు బంధువుల ఇంటికి వెళ్లారు. బుధవారం ఉదయం స్వగ్రామమైన చెర్కుపల్లికి అంజయ్య భా ర్య పుల్లమ్మ, అంజయ్య చెల్లెలి పిల్లలైన వంశీ, మానసలను తీసుకొని ద్విచక్రవాహనం పై వెళ్తున్నాడు. చందంపేట మండలం ఇసుకబావి స్టేజీ వద్ద చెర్కుపల్లి నుంచి వైజాగ్‌కాలనీ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బాబా, పర్వీన దంపతుల బుల్లెట్‌ వాహ నం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో అంజయ్య అక్కడికక్కడే మృతి చెందా డు. గాయపడిన పుల్లమ్మ, మానస, వంశీ, బాబా, పర్వీనలను 108 వాహనంలో దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. షేక్‌బాబా, మానస, వంశీలకు తీవ్రగాయాలవడం తో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించారు. పుల్లమ్మ దేవరకొండ ప్రైవే ట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పర్వీనకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంజయ్యకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. 

Updated Date - 2021-12-30T06:35:37+05:30 IST