కామినేనిలో తులియం లేజర్ చికిత్స
ABN , First Publish Date - 2021-10-20T06:36:59+05:30 IST
నార్కట్పల్లి కామినేని వైద్య విద్యా కళాశాల(కిమ్స్)లో అత్యాతాధునిక తులియం లేజర్ చికిత్స సదుపా యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆస్పత్రి జీఎం శౌరీరెడ్డి తెలిపారు. శస్త్రచికిత్స వైద్య నిపుణుడు పీవీఎల్ మూర్తితో కలిసి ఆస్పత్రి కార్యాల యంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఆస్పత్రి యాజమా న్యం తులియం లేజర్ పరికరాన్ని స్విట్జర్లాండ్ నుంచి

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇదే మొదటిది
నార్కట్పల్లి, అక్టోబరు 19: నార్కట్పల్లి కామినేని వైద్య విద్యా కళాశాల(కిమ్స్)లో అత్యాతాధునిక తులియం లేజర్ చికిత్స సదుపా యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆస్పత్రి జీఎం శౌరీరెడ్డి తెలిపారు. శస్త్రచికిత్స వైద్య నిపుణుడు పీవీఎల్ మూర్తితో కలిసి ఆస్పత్రి కార్యాల యంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఆస్పత్రి యాజమా న్యం తులియం లేజర్ పరికరాన్ని స్విట్జర్లాండ్ నుంచి తెప్పించిందని, నిడమనూరు మండలంలోని గుంటిపల్లి గ్రామానికి చెందిన బాలికకు ఈ లేజర్ విధానం ద్వారా తొలి చికిత్సను విజయవంతంగా చేశారని తెలిపారు. మెట్రో నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే ఈ చికిత్స అందుబాటులో ఉంటుందని, సుమారు రూ.లక్ష వరకు ఖర్చయ్యే ఈ తరహా చికిత్స ఉమ్మడి జిల్లాలో నార్కట్పల్లి కామినేనిలోనే అందు బాటులో ఉందన్నారు. ఆరోగ్య శ్రీ వర్తించే వారికి ఉచితంగా తులియం లేజర్ చికిత్స చేస్తామని, ఆరోగ్యశ్రీ వర్తించని వారికి కేవలం మెడిసిన్ ఖర్చులతోనే చికిత్స అందిస్తామన్నారు. లేజర్ చికిత్స ద్వారా కిడ్నీ రాళ్లను బ్లాస్ట్ చేయడం, ప్రోస్టేట్ ఆపరేషన్, మూత్రసంచి క్యాన్సర్ తొల గించడం, మూసుకుపోయిన మూత్రనాళానికి కోత పెట్టడం వంటి చికిత్సలను వేరే అవయవంపై దుష్ప్రభావాలు చూపకుండా చేయవ చ్చని డాక్టర్ మూర్తి వివరించారు. సమావేశంలో వైద్యులు టీ.నరేందర్, వై.వినయ్ కుమార్రెడ్డి, సాదన్కుమార్, అప్పారావు పాల్గొన్నారు.