టీటీడీపీ అధ్యక్షుడు 11న చిలుకూరుకు రాక

ABN , First Publish Date - 2021-12-08T06:18:00+05:30 IST

టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఈ నెల 11న చిలుకూరు మండల కేంద్రానికి వస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారి ఓరుగంటి ప్రభాకర్‌ తెలిపారు.

టీటీడీపీ అధ్యక్షుడు 11న చిలుకూరుకు రాక

కోదాడ టౌన్‌, డిసెంబరు 7 : టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఈ నెల 11న చిలుకూరు మండల కేంద్రానికి వస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారి ఓరుగంటి ప్రభాకర్‌ తెలిపారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2003లో చిలుకూరులో ఆనాటి ప్రభుత్వం పేదలకు ప్రభుత్వ భూమిలో ఇళ్ల పట్టాలను ఇచ్చి ందని తెలిపారు. నేటికీ లబ్ధిదారులకు భూములను అందించకపోవటం దురదృష్టకరమన్నారు. ఇళ్ల స్థలాల పరిశీలనకు రాష్ట్ర అధ్యక్షుడు వస్తున్నట్లు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని సూచించారు. కార్యక్రమంలో సూర్యం, బయ్య నారాయణ, సాతులూరి గురవయ్య, పిట్టల శోభన్‌బాబు, కొల్లు గణేష్‌, కొల్లు సత్యనారాయణ, శ్రీమన్నారాయణ, సజ్జా రామోహన్‌రావు, కొండా వెంకటనర్సయ్య, రామినేని నర్సింహారావు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T06:18:00+05:30 IST