రేవంత కోసం హైదరాబాద్ బాట
ABN , First Publish Date - 2021-07-08T06:58:31+05:30 IST
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంతరెడ్డి పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవానికి జిల్లావ్యాప్తంగా కార్యకర్తలు బుధవారం హైదరాబాద్ తరలివెళ్లారు.

భూదానపోచంపల్లి / ఆత్మకూరు(ఎం) / బీబీనగర్ / ఆలేరు / చౌటుప్పల్ రూరల్ / తుర్కపల్లి / యాదాద్రి రూరల్, జూలై 7 : టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంతరెడ్డి పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవానికి జిల్లావ్యాప్తంగా కార్యకర్తలు బుధవారం హైదరాబాద్ తరలివెళ్లారు. డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో భూదానపోచంపల్లి నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు తరలివెళ్లారు. పట్టణ అధ్యక్షులు గునిగంటి రమే్‌షగౌడ్ జెండా ఊపి వా హనాలను ప్రారంభించారు. ఆత్మకూర్ మండల కేంద్రానికి చెంది న ఎనఎ్‌సయూఐ, యూత కాంగ్రెస్ నాయకులు తరలివెళ్లారు. బీబీనగర్ మండల అధ్యక్షుడు పోట్టొళ్ల శ్యాంగౌడ్ ఆధ్వర్యంలో వందలాది మంది కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిఽధులు, కార్యకర్తలు వాహనాల్లో పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఆలేరు పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ర్యాలీ తీసిన అనంతరం హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు, ఖమ్మం, ఆంధ్రప్రదేశ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున త రలివెళ్లారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి సందడిగా మారింది. పంతంగి టోల్‌గేట్ వద్ద రద్దీ నెలకొంది. దీం తో టోల్‌గేట్ వద్ద 16గేట్లకు గానూ హైదరాబాద్ వైపు 10గేట్ల ద్వారా వాహనాలను పంపించారు. అదేవిధంగా ఆంథోల్‌మైసమ్మ దేవాలయం వద్ద కార్యకర్తలు పూజలు నిర్వహించారు. తుర్కపల్లి మండల అధ్యక్షుడు ధానావత శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో కార్యకర్తలు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఆలేరు నియోజకవర్గం వ్యాప్త ంగా 540 వాహనాల్లో నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. ఆలేరు నియోజవకవర్గ ఇన్‌చార్జీ బీర్ల ఐలయ్య ప్రజలకు అభివాదం చేశారు. బీర్ల ఐలయ్య హైదరాబాద్‌లో రేవంతరెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.