యాదాద్రి క్షేత్రంలో సంప్రదాయ పూజలు

ABN , First Publish Date - 2021-10-31T05:47:04+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం నిత్య కైంకర్యా లు సంప్రదాయరీతిలో కొనసాగాయి.

యాదాద్రి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
బాలాలయంలో లక్ష్మీనృసింహుల నిత్యతిరుకల్యాణ పర్వాలు నిర్వహిస్తున్న అర్చకుడు

యాదాద్రి టౌన్‌, అక్టోబరు 30: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం నిత్య కైంకర్యా లు సంప్రదాయరీతిలో కొనసాగాయి. వేకువజామున స్వయంభువులను సుప్రభాతంతో మేల్కొలిపి బాలాలయంలోని కవచమూర్తులను హారతితో కొలిచారు. మండపంలో ఉత్సవమూర్తులను వేదమంత్రాలతో అభిషేకించి తులసీ దళాలతో అర్చించారు. అనంతరం సుదర్శన శత క పఠనంతో హోమపూజలు చేసి, నిత్యకల్యాణ వేడుకల ను ఆగమ శాస్త్రరీతిలో చేపట్టారు. ఆలయంలో సువర్ణ పుష్పార్చనలు, అష్టోత్తరాలు, వ్రత మండపంలో సత్యదేవుడి వ్రతాలు కొనసాగాయి. కొండపైన శివాలయంలో రామలింగేశ్వరుడికి ఆరాధనలు, ఉపాలయంలో చరమూర్తులకు నిత్యపూజలు శైవాగమ పద్ధతిలో నిర్వహించారు. స్వామికి వివిధ విభాగాల ద్వారా రూ.9,57,193 ఆదా యం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. అదేవిధంగా యాదాద్రి ప్రధానాలయ విమాన గోపురం బంగారు తాపడం కోసం హైదరాబాద్‌కు చెందిన భక్తు డు, సెంట్రల్‌ బ్యాంకు రిటైర్డ్‌ మేనేజర్‌ జీపీ రాములు శనివారం రూ.49,215 చెక్కును విరాళంగా అందజేశారు.  

Updated Date - 2021-10-31T05:47:04+05:30 IST