ధరలు నియంత్రించకుంటే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2021-05-20T06:48:53+05:30 IST
లాక్‌డౌన్‌లో ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ డి.శ్రీనివా్‌సరెడ్డి వ్యాపారులను హెచ్చరించారు.

అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి
భువనగిరి టౌన్, మే 19: లాక్‌డౌన్‌లో ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ డి.శ్రీనివా్‌సరెడ్డి వ్యాపారులను హెచ్చరించారు. నిత్యవసర వస్తువుల ధరలను వ్యాపారులు పెంచారని వస్తున్న ఫిర్యాదుల మేరకు పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, అడిషనల్ డీసీపీ ఎన్.భుజంగరావు, తూనికలు, కొలతల అధికారి సంజయ్‌కృష్ణతో కూడిన జిల్లా ధరల నియంత్రణ కమిటీ బుధవారం భువనగిరి మార్కెట్‌లో విస్తృతంగా తనిఖీలు చేసింది. మార్కె ట్ యార్డుతోపాటు పట్టణంలోని పలు దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేసి ధర లు, నాణ్యతా, స్టాక్, విక్రయ విధానాలను పరిశీలించింది. కమిటీ సభ్యులు కొనుగోలు దారులతో మాట్లాడారు. తూకం మిషన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ వ్యాపారుల అవకతవకలపై ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సూచించారు.