నేడు వాసాలమర్రికి సీఎం

ABN , First Publish Date - 2021-06-22T06:52:31+05:30 IST

వాసాలమర్రిలో ఈనెల 22న సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు యుద్ధప్రాతిపదికన నాలుగు రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గాదరి బాలమల్లు ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతుండ గా, కలెక్టర్‌ పమేలా సత్పథి, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

నేడు వాసాలమర్రికి సీఎం
వాసాలమర్రిలో ఏర్పాటు చేసిన గ్రామ సభావేదిక

అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు

గ్రామ సభ, సహపంక్తి భోజనాలు

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీ్‌షరెడ్డి


తుర్కపల్లి, జూన్‌ 21: వాసాలమర్రిలో ఈనెల 22న సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు యుద్ధప్రాతిపదికన నాలుగు రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గాదరి బాలమల్లు ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతుండ గా, కలెక్టర్‌ పమేలా సత్పథి, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి  పర్యవేక్షిస్తున్నారు. గ్రామ సభ, సహపంక్తి భోజనాల్లో సీఎం పాల్గొననుండటంతో మంత్రి జగదీ్‌షరెడ్డి సోమవారం గ్రామాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మహేందర్‌రెడ్డి,  కలెక్టర్‌, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడి,్డ డీఆర్‌డీఏ ఉపేందర్‌రెడ్డి, సర్పంచ్‌ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్‌కుమార్‌తో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దత్తత గ్రామ అభివృద్ధిపై సీఎంకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. గ్రామంలో ఏ వసతులుండాలి, పచ్చదనం, మౌలిక అవసరాలు, ప్రజల కు ప్రభుత్వం కల్పించాల్సిన సౌకర్యాలపై సీఎం దృష్టిసారించారన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా ఇప్పటికే పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను సీఎం అమలుచేస్తున్నారన్నారు. వాసాలమర్రిని దత్తత తీసుకొని గ్రామ అభివృద్ధికి గ్రామస్థుల అభిప్రా యం సేకరించేందుకు సీఎం మంగళవారం పర్యటించనున్నారని తెలిపారు. వాసాలమర్రి రాష్ట్రంలో ఆదర్శగ్రామంగా రూపుదిద్దుకోనుందన్నారు. సీఎం ఏదన్నా అన్నారంటే అది జరిగి తీరాల్సిందేనన్నారు. గ్రామా న్ని దత్తత ప్రకటించిన అనంతరం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అధికారులు రూపొందించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను గ్రామసభలో సీఎం ప్రకటిస్తారని మంత్రి తెలిపారు.


ఏర్పాట్లు పూర్తి

వాసాలమర్రి-కొండాపూర్‌, భువనగిరి-గజ్వేల్‌ రహదారి లో ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాల వెంట సుమారు 20ఎకరాల స్థలంలో గ్రామసభ, సహపంక్తి భోజనాలకు ఏర్పాట్లు చేశారు. 10ఎకరాలు గ్రామసభ కోసం కేటాయించారు. భోజనాలకు 5ఎకారాలు కేటాయించారు. మరో 5ఎకరాలు పార్కింగ్‌ కోసం స్థలం కేటాయించారు. కాగా, సభ, సహపంక్తి భోజనాలకు గ్రామస్థులంతా హాజరయ్యేలా 2300 మందికి పాస్‌లు జారీ చేశారు. ఓటర్‌ లిస్టు ప్రకారం కుటుంబంలోని సభ్యులందరికీ పాస్‌లు జారీ చేశారు. అయి తే వలస వెళ్లిన కుటుంబసభ్యులకు, ఓటర్‌ లిస్టులో పేరులేని వారి కుటుంబసభ్యులకు పాస్‌లు ఇవ్వలేదు. గ్రామ సభలో సభావేదికపై సీఎంతోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూర్చోనున్నారు. వేదిక ఎదురుగా గ్రామస్థులు కూర్చునేలా కుర్చీలు ఏర్పాటు చేశారు. వేదికకు ఓ పక్కన అధికారులు, మరోపక్క మీడియా ప్రతినిధులు కూర్చోనున్నారు. అనుకోకుండా వర్షం వస్తే ఇబ్బందులు లేకుండా వాటర్‌ప్రూఫ్‌ టెంట్లు ఏర్పాటు చేశారు. సీఎం మధ్యాహ్నం 12.30గంటలకు వాసాలమర్రికి చేరుకుంటారు. వెంటనే సహపంక్తి భోజనాలు చేసి, సర్పంచ్‌ పోగుల ఆంజేయులు ఇంటికివెళ్తారు. అక్కడి నుంచి నేరుగా గ్రామసభకు చేరుకుంటారు. సుమారు మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో గ్రామసభ ప్రారంభం కానుంది.


విందు భలే పసందు..

వాసాలమర్రి గ్రామస్థులతో సీఎం కేసీఆర్‌ సహపంక్తి భోజనా లు చేయనున్నారు. గ్రామసభ, సహపంక్తి భోజనాలకు కేవలం గ్రా మస్థులు మాత్రమే హాజరయ్యేలా ఇప్పటికే అందరికీ గుర్తింపుకార్డు లు ఇచ్చారు. ఈ కార్డు తీసుకొని వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తారు. కాగా, సహపంక్తి భోజనాల ఏర్పాట్లు సోమవారం రాత్రే ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన 150మందికిపైగా వంటమాస్టార్లు, వారి సహాయకులు విందు భోజనం వండనున్నారు. కాగా, సహపంక్తి భోజనాల్లో శాకాహారం, మాంసాహారం మొత్తం 20రకాల వంటకాలను వడ్డించనున్నారు. విందులో ప్రధానంగా మేథీ చికెన్‌ఫ్రై, మటన్‌ కర్రీ, ఫిష్‌ పులు సు, ఎగ్‌ పులుసు, మటన్‌ దాల్చా, బగారా, ప్లెయిన్‌ రైస్‌ మాంసాహారులకు వడ్డించనున్నారు. ఇక శాకాహారుల కోసం మిర్చి కూర, ఆలుగోబీ టమాటా షెర్వా, బెండకా య కాజు ఫ్రై, చిక్కుడు మేథీ ఫ్రై, గం గబావి, మామిడి పప్పు, పచ్చిపులుసు, ఉల్లిపాయచారు, పుంటికూర చట్నీ, పెరుగుచట్నీ, పెరుగు వడ్డించనున్నారు. అలాగే తీపిపదార్థాలుగా డబుల్‌కామీఠా, కద్దూకాఖీర్‌ వడ్డించనున్నారు. చివరగా స్వీట్‌పాన్‌ కూడా ఇవ్వనున్నారు.


 పటిష్ఠ బందోబస్తు

సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 750మంది పోలీసు అధికారులు, సిబ్బంది బందోబస్తులో పాల్గొననున్నారు. ఇద్దరు డీసీపీలు, ఆరుగురు ఏసీపీలు, 15మంది సీఐలు, 47మంది ఎస్‌ఐలు, 53మంది ఏఎ్‌సఐలు, 80 హెడ్‌కానిస్టేబుళ్లు, 460 కానిస్టేబుళ్లు, 80మంది మహిళా కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నారు. ఇప్పటికే బాంబ్‌స్క్వాడ్‌ తనిఖీలు పూర్తయ్యాయి. కాగా, భద్రతా ఏర్పాట్లను రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ మంగళవారం పరిశీలించారు. ఆయన వెంట భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి, యాదగిరిగుట్ట రూరల్‌ సీఐ నర్సయ్య తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-06-22T06:52:31+05:30 IST