నేడు వరి కోతలు బంద్‌

ABN , First Publish Date - 2021-10-31T06:06:14+05:30 IST

జిల్లా వ్యాప్తంగా, ప్రధానంగా ఆయకట్టు ప్రాంతాల్లో ఈ నెల 31న వరికోతలకు విరామం ఇచ్చినట్టు అధికారులు ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నందున మిర్యాలగూడలోని రైస్‌ మిల్లుల వద్ద ధాన్యం వాహనాలు భారీగా నిలుస్తున్నాయి.

నేడు వరి కోతలు బంద్‌

నేరేడుచర్ల, అక్టోబరు 30: జిల్లా వ్యాప్తంగా, ప్రధానంగా ఆయకట్టు ప్రాంతాల్లో ఈ నెల 31న వరికోతలకు విరామం ఇచ్చినట్టు అధికారులు ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నందున మిర్యాలగూడలోని రైస్‌ మిల్లుల వద్ద ధాన్యం వాహనాలు భారీగా నిలుస్తున్నాయి. దీంతో రహదారిపై ట్రాఫిక్‌జాం అవడంతోపాటు, కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఇటీవల హార్వెస్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఈ నెల 29, 31న వరి కోతలకు విరామం ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఈ నెల 29న వరికోతలకు విరామం ఇచ్చారు. 31న వరికోతలకు విరామంతోపాటు, 31న ఉదయం నుంచి నవంబరు 1వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ధాన్యం ట్రాక్టర్లు, లారీల్లో ధాన్యం తీసుకువస్తే నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి మూసీ వంతెనపై నిలిపివేయనున్నట్లు ఎస్‌ఐ విజయ్‌ ప్రకాష్‌ తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.

Updated Date - 2021-10-31T06:06:14+05:30 IST