నేటి సాగర్‌-శ్రీశైలం లాంచీ ప్రయాణం రద్దు

ABN , First Publish Date - 2021-08-21T06:25:17+05:30 IST

నాగార్జునసాగర్‌ జలాశయం నుంచి శ్రీశైలానికి ఈ నెల 21వ తేదీన వెళ్లాల్సిన లాంచీ ప్రయాణాన్ని రద్దు చేసినట్లు లాంచీస్టేషన మేనేజర్‌ హరి శుక్రవారం తెలిపారు.

నేటి సాగర్‌-శ్రీశైలం లాంచీ ప్రయాణం రద్దు

పర్యాటకుల అనాసక్తే కారణం
నాగార్జునసాగర్‌, ఆగస్టు 20:
నాగార్జునసాగర్‌ జలాశయం నుంచి శ్రీశైలానికి ఈ నెల 21వ తేదీన వెళ్లాల్సిన లాంచీ ప్రయాణాన్ని రద్దు చేసినట్లు లాంచీస్టేషన మేనేజర్‌ హరి శుక్రవారం తెలిపారు. సాగర్‌ నుంచి శ్రీశైలానికి లాంచీలను నడపాలని పర్యాటక శాఖ భావించినా పర్యాటకులెవరూ ఆసక్తి చూపకపోవడంతో రద్దు చేశామన్నారు. లాంచీ ప్రయాణానికి పర్యాటకులెవరూ టికెట్లు  బుక్‌ చేసుకోలేదని పేర్కొన్నారు. పర్యాటకులు తమ ప్రయాణానికి టిక్కెట్లు తీసుకుంటే ఈ నెల 28వ తేదీన సాగర్‌-శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని కొనసాగిస్తామన్నారు.

Updated Date - 2021-08-21T06:25:17+05:30 IST