గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి : పైళ్ల

ABN , First Publish Date - 2021-06-22T07:04:52+05:30 IST

పల్లె సందర్శన కార్యక్రమ ంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి అక్కడి ప్రతి సమ స్య పరిష్కారానికి కృషి చేస్తానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు.

గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి : పైళ్ల
పిలాయిపల్లిలో రైతువేదికను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

భూదాన్‌పోచంపల్లి / బీబీనగర్‌, జూన్‌ 21 : పల్లె సందర్శన కార్యక్రమ ంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి అక్కడి ప్రతి సమ స్య పరిష్కారానికి కృషి చేస్తానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఆయా శాఖల అధికారులు, మండల ప్రజాప్రతినిధులతో కలిసి పోచంపల్లి మండల పరిధిలోని పెద్దగూడెం, జగత్‌పల్లి, పిలాయిపల్లి, దేశ్‌ముఖి గ్రామాల్లో సందర్శించి గ్రామంలోని ప్రధాన సమస్యలు గుర్తించి పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశి ంచారు. ప్రతీ గ్రామంలో సీసీరోడ్లు, డ్రైనేజీలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని కోరారు. పిలాయిపల్లి కాల్వ పనులు వేగవంతం చేసి వానా కాలం సీజన్‌లో రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాల ని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పిలాయిపల్లి గ్రామంలో రైతువేదిక, గ్రామపంచాయతీ భవనం, పీహెచ్‌సీ సబ్‌సెంటర్‌, శ్మశాన వాటిక (వైకుంఠదామం), పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. పిలాయిపల్లిలో సుమారు 1కోటి 80లక్షల అభివృద్ధి పనులను ప్రారం భించారు. అనంతరం మాట్లాడుతూ హెచ్‌ఎండీఏ ద్వారా మంజూరైన రూ.30కోట్ల నిధులతో భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్‌, భువనగిరి మండ లాల్లోని గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఎన్‌ఆ ర్‌ఈజీఎస్‌, గ్రామపంచాయతీల నిధులతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్పలత, వైస్‌ ఎంపీపీ పాక వెంకటేశం యాదవ్‌, డీసీసీబీ డైరెక్టర్‌ అందెల లింగంయాదవ్‌, పోచంపల్లి పీఏసీ ఎస్‌ చైర్మన్‌ కందాడి భూపాల్‌రెడ్డి, పాటి సుధాకర్‌రెడ్డి, రంగ విశ్వనా థంగౌడ్‌, రావుల శేఖర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు మన్నె పద్మా రెడ్డి, నోముల ఎల్లారెడ్డి, అందెల హరీష్‌యాదవ్‌, దుర్గం స్వప్న నరేష్‌, సామ రవీందర్‌రెడ్డి, గోరంటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీలు చిల్లర జంగయ్య, బందారపు సుమలత లక్ష్మణ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బీబీనగర్‌ మండలంలోని చిన్నరావులపల్లి, బట్టుగూడెం గ్రామాలను ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి సందర్శించి అక్కడి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమలతో పాటు ప్రజలు సైతం గ్రామాల అభివృ ద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్‌గౌడ్‌, జడ్పీటీసీ ప్రణీత, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ బొక్క జైపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్‌, సర్పంచ్‌ బక్కన్న బాలమణి, మాధవి, ఎంపీటీసీ గోరుకంటి బాలచందర్‌, నాయకులు శ్రీనివాస్‌, శ్రీశైలం, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-22T07:04:52+05:30 IST