మున్నూరు కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-09-03T06:59:41+05:30 IST

మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాపు సంఘం జిల్లా నాయకులు కోరారు.

మున్నూరు కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి
హుజూర్‌నగర్‌లో తహసీల్దార్‌కు వినపత్రం ఇస్తున్న కాపు సంఘం నాయకులు

హుజూర్‌నగర్‌ రూరల్‌/కోదాడ టౌన్‌/గరిడేపల్లి/మద్దిరాల/ మేళ్ల చెర్వు, సెప్టెంబరు 2: మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాపు సంఘం జిల్లా నాయకులు కోరారు. కాపుల అభ్యున్నతికి ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించాలన్నారు. జిల్లాలోని పలు తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట గురువారం ఆందోళన చేసి తహసీల్దార్లకు వినతిపత్రం అందజేశారు.  హుజూర్‌ నగర్‌లో వినతిపత్రం ఇచ్చిన వారిలో  కోలపాటి వెంకటేశ్వర్లు, పోటు నాగేశ్వరరావు, రామిశెట్టి రాము, కోల నాగేశ్వరరావు ఉన్నారు. ‘కాపు బంధు’ పథకం ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ కోదాడలో నాయ కుడు జగన్మోహన్‌రావు, గరిడేపల్లిలో కాపు సంఘం మండల అధ్యక్షుడు కడియాల అప్పయ్యలు ఆయా తహసీల్దార్లకు వినతిపత్రం అంద జేశారు. కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ మద్దిరాలలో కాపు సంఘాల మండల అధ్యక్షుడు మూరగుండ్ల సోమయ్య అధ్వ ర్యంలో తహసీల్దార్‌ మన్నన్‌కు, మేళ్లచెర్వులో కాపు సంఘం నియో జకవర్గ కన్వీనర్‌ పాలేటి రామారావు ఆధ్వర్యంలో తహసీల్దార్‌ దామో దర్‌కు వినితిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమాల్లో కాపు సంఘం నాయకులు ఆవుల బాబు, వేణు, వెంకటనారాయణ, ధనమూర్తి, బండి శేఖర్‌, నితిన్‌, బుస్సా నరసింహారావు, మైలా మల్లికార్జున్‌, సూరిశెట్టి బసవయ్య, రాయల వెంకటేశ్వర్లు, బాబు ఉన్నారు. 



Updated Date - 2021-09-03T06:59:41+05:30 IST