విద్యుదాఘాతంతో మూడు ఎద్దులు మృతి

ABN , First Publish Date - 2021-11-22T05:19:03+05:30 IST

మోత్కూరు, రాజాపేట మండలాల్లో ఆదివారం విద్యుదాఘాతానికి గురై మూడు ఎద్దులు మృతి చెందాయి.

విద్యుదాఘాతంతో మూడు ఎద్దులు మృతి

రాజాపేట, మోత్కూరు, నవంబరు 21: మోత్కూరు, రాజాపేట మండలాల్లో ఆదివారం విద్యుదాఘాతానికి గురై మూడు ఎద్దులు మృతి చెందాయి. వివరాల్లోకి వెళితే... రాజాపేట మండలంలోని పుట్టగూడెం గ్రా మానికి చెందిన గుగులోతు రాజు తన ఎద్దులను మేతకోసం వ్యవసాయ పొలానికి తోలుకెళ్లాడు. పొలం వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్సఫార్మర్‌ వద్ద మేత మేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాయి.  సుమారు రూ.1 లక్ష ఆస్తి నష్టం వాటిల్లినట్లు రాజు వాపోయాడు. మో త్కూరు మండలంలోని పొడిచేడు గ్రామానికి చెందిన పోతరబోయిన దే వయ్యకు చెందిన కాడెద్దు ఆదివారం విద్యుదాఘాతానికి గురై మృతి చెం దింది. మేత మేస్తూ వెళ్లిన ఎద్దు ట్రాన్సఫార్మర్‌కు రక్షణగా ఉన్న విద్యుత తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. దాని విలువ రూ. 50 వేలు ఉంటుందని బాధితుడు దేవయ్య వాపోయాడు. 


Updated Date - 2021-11-22T05:19:03+05:30 IST