ఈ దశాబ్దం సాంకేతిక రంగానిదే: సుమన్‌ భోక్రే

ABN , First Publish Date - 2021-12-07T07:07:46+05:30 IST

ఈ దశాబ్దం సాంకేతిక రంగానిదేనని, టెకీలు కష్టపడి చదివి కలలను సాకారం చేసుకోవాలని మానసిక వికాస నిపుణులు, మోటి వేషనల్‌ స్పీకర్‌ సుమన్‌ భోక్రే అన్నారు.

ఈ దశాబ్దం సాంకేతిక రంగానిదే: సుమన్‌ భోక్రే

మిర్యాలగూడ టౌన్‌, డిసెంబరు 6: ఈ దశాబ్దం సాంకేతిక రంగానిదేనని, టెకీలు కష్టపడి చదివి కలలను సాకారం చేసుకోవాలని మానసిక వికాస నిపుణులు, మోటి వేషనల్‌ స్పీకర్‌ సుమన్‌ భోక్రే అన్నారు. పట్టణంలోని మినా మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలలో సోమవారం నిర్వహించిన ప్రేరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒత్తిడిని అధిగమించే సామర్ధ్యాన్ని సాధించగలిగితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చ న్నారు. ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌తో కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక విద్యలో రాణిస్తే ప్రపంచపు నలుమూలల్లో కొలువులు సాధించవచ్చన్నారు.  కళాశాల చైర్మన్‌ మహిమూద్‌ అలీ మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ విద్యలో వస్తున్న సమూల మార్పులతో సాఫ్ట్‌వేర్‌ రంగం ఎవర్‌గ్రీన్‌గా మారనుందన్నారు.  కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ షాజీ, విద్యావేత్తలు షెహ్లాబతూల్‌, వాణి, డాక్టర్‌ రాయుడు, నాగరాజు, రామకృష్ణారెడ్డి, సుబ్బారాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-07T07:07:46+05:30 IST