వారిని వారే కొనుక్కొని గెలుపంటున్నారు

ABN , First Publish Date - 2021-12-15T05:49:18+05:30 IST

వాళ్ల పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను వారే కొనుక్కొని గెలిచామని టీఆర్‌ఎస్‌ చెప్పుకోవడం సిగ్గుచేటని దుబ్బాక ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు ఎద్దేవా చేశారు. యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరిలో మంగళవారం రాత్రి నిర్వహించిన బీజేపీ శిక్షణా తరగతుల ముగింపు అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు.

వారిని వారే కొనుక్కొని గెలుపంటున్నారు

నిధులు, విధులు అడిగితే కవర్లు ఇచ్చారు

ప్రజాప్రతినిధులను అవమానించారు

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఎద్దేవా


యాదాద్రి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): వాళ్ల పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను వారే కొనుక్కొని గెలిచామని టీఆర్‌ఎస్‌ చెప్పుకోవడం సిగ్గుచేటని దుబ్బాక ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు ఎద్దేవా చేశారు. యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరిలో మంగళవారం రాత్రి నిర్వహించిన బీజేపీ శిక్షణా తరగతుల ముగింపు అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బలం టీఆర్‌ఎ్‌సకు ఉన్నా క్యాంపులు ఏర్పాటు చేసి, డబ్బులిచ్చి ఓట్లు వేయించుకొని గెలిచామని ఆ పార్టీ నాయకులు చంకలు గుద్దుకుంటున్నారని, ఇదేం పాలన అని అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నిధులు, విధులు, ఆత్మగౌరవం అడిగితే ఇవేం ఇవ్వకుండా రిసార్టులు, హోటళ్లు, విహార యాత్రలకు తిప్పుతూ చివరికి చేతిలో డబ్బు కవరు పెట్టి అవమానించారని అన్నారు. బలం లేకున్నా ఆత్మాభిమానం కోసం బీజేపీ, కాంగ్రెస్‌ కొన్ని చోట్ల అభ్యర్థులను నిలిపిందన్నారు. ఇప్పటికైనా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు విధులు కేటాయించి నిధులు విడుదల చేయాలని, ఎంపీపీ, జడ్పీటీసీలకు దక్కిన గౌరవం ఎంపీటీసీలకు కూడా దక్కేలా చూడాలని అన్నారు.

Updated Date - 2021-12-15T05:49:18+05:30 IST