రెండో రోజు కబడ్డీ పోటీల్లో విజేతలు వీరే..
ABN , First Publish Date - 2021-03-24T06:29:51+05:30 IST
రాజస్థాన్(54)-బీహార్(31) జట్ల మధ్య జరిగిన పోటీలో రాజస్థాన్ జట్టు 23 పాయింట్లతో గెలుపొందింది. హార్యానా(67)-ఒరిస్సా (36)జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హర్యానా 31 పాయింట్లతో విజయం సాధించింది.

బాలుర విభాగంలో..
సూర్యాపేటక్రైం, మార్చి 23: రాజస్థాన్(54)-బీహార్(31) జట్ల మధ్య జరిగిన పోటీలో రాజస్థాన్ జట్టు 23 పాయింట్లతో గెలుపొందింది. హార్యానా(67)-ఒరిస్సా (36)జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హర్యానా 31 పాయింట్లతో విజయం సాధించింది. కేరళ(50)-పాండిచ్చేరి(28) జరిగిన పోటీలో 22 పాయింట్లతో కేరళ విజయం సాధించింది. జార్ఖండ్(62)-పశ్చిమబెంగాల్(44) మధ్య జరిగిన మ్యాచ్‌లో 22 పాయింట్ల తేడాతో జార్ఖండ్ జట్టు గెలుపొందింది. తమిళనాడు (54)- మధ్యప్ర దేశ్(35) జట్ల మధ్య సాగిన మ్యాచ్‌లో తమిళనాడు జట్టు 19పాయింట్ల తేడాతో మధ్యప్రదేశ్‌ను ఓడించింది. పంజాబ్(47)-మణిపూర్(36) జట్ల మధ్య జరిగిన పోటీలో 11 పాయింట్ల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. ఢిల్లీ(38)- త్రిపుర (12) జట్ల మధ్య జరిగిన పోటీలో 26 పాయింట్లతో ఢిల్లీ గెలిచింది. అదే విధంగా హిమాచల్‌ప్రదేశ్(53)- పాండిచ్చేరి(25) మధ్య జరిగిన మ్యాచ్‌లో 28పాయింట్ల తేడాతో హిమాచల్‌ప్రదేశ్ విజయం సాధించింది. అదే విధంగా తెలంగాణ(23)- ఉత్తరప్రదేశ్(54) జట్ల మధ్య పోటీల్లో ఉత్తరప్రదేశ్ జట్టు 31 పాయింట్ల తేడాతో తెలంగాణపై గెలుపొందింది. జమ్ముకాశ్మీర్(41)-సిక్కిం(38) జట్ల మధ్య సాగిన మ్యాచ్‌లో జమ్ముకాశ్మీర్ జట్లు 3పాయింట్లతో విజయం సాదించింది. ఢిల్లీ(34)- గుజరాత్(8) జట్ల మధ్య ఏకపక్షంగా జరిగిన పోటీలో ఢిల్లీ గెలిచింది. కేరళ(40)- ఆంధ్రప్రదేశ్(45) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 5పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ గెలిచింది.
బాలికల విభాగంలో...
మహారాష్ట్ర(62)-కేరళ(25) జట్ల మధ్య జరిగిన పోటీలో మహారాష్ట్ర జట్టు 37 పాయింట్ల తేడాతో గెలుపొందింది. గోవా(37)-మణిపూర్(24) జట్ల మధ్య సాగిన మ్యాచ్‌లో 13 పాయింట్లతో గోవా గెలిచింది. ఛత్తీస్‌ఘడ్(48)-జమ్ముకాశ్మీర్(11) జట్ల మధ్య ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 37 పాయింట్లతో చత్తీస్‌ఘడ్ జట్టు విజయం సాధించింది. జార్ఖండ్(45)-కర్ణాటక(39) జట్ల మధ్య జరిగిన పోటీలో జార్ఖండ్ టీం ఆరు పాయింట్లతో గెలుపొందింది. అదే విధంగా పంజాబ్(39)-విధర్భ(23) జట్ల మధ్య సాగిన మ్యాచ్‌లో 16పాయింట్ల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. పశ్చిమబెంగాల్(39)-గుజరాత్(32) జట్ల మఽధ్య జరిగిన పోటీలో పశ్చిమబెంగాల్ 7పాయింట్లతో విజయం సాధించింది. హర్యానా(74)-జమ్ముకాశ్మీర్(12) జట్ల మధ్య ఏకపక్షంగా జరిగిన పోటీలో హార్యానా జట్టు 62 పాయింట్లతో గెలిచింది. తెలంగాణ(42)-బీహార్(38) జట్ల మధ్య రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో చివరి నిమిషంలో తెలంగాణ క్రీడాకారిణి కూతకు వెళ్లి 5పాయింట్లు సాధించడంతో తెలంగాణ జట్టు విజయం సాధించింది. తమిళనాడు(22)-పాండిచ్చేరి(3) జట్ల మధ్య ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు 19 పాయింట్ల తేడాతో గెలుపొందింది. మధ్యప్రదేశ్(14)-రాజస్థాన్(24) జట్ల మధ్య జరిగిన పోటీలో 10 పాయింట్ల తేడాతో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్(39)-ఉత్తరప్రదేశ్(32) జట్ల మధ్య సాగిన పోటీలో ఆంధ్రప్రదేశ్ జట్లు 7పాయింట్లతో విజయం సాధించింది. ఉత్తరఖండ్(12)-గుజరాత్(50) జట్ల మధ్య ఏకపక్షంగా జరిగిన పోటీలో గుజరాత్ జట్టు 38పాయింట్ల తేడాతో గెలిచింది. మహారాష్ట్ర(62)-విధర్భ(12) జట్ల మధ్య జరిగిన పోటీలో మహారాష్ట్ర జట్టు 50పాయింట్ల తేడాతో గెలిచింది. మూడో రోజు బుధవారం మ్యాచ్‌లు సాయంత్రం 4గంటల నుండి రాత్రి వరకు జరగనున్నాయి. ఈమ్యాచ్‌లన్నీ లీగ్ కమ్ నాకౌట్ పద్దతిలో కొనసాగుతున్నాయి. చివరి రోజు పోటీలు ఎంతో ఉత్కంఠభరితంగా ఉండనున్నాయి.